సినిమా

శ్రీదేవి కుటుంబానికి అద్దిరిపోయే శుభవార్త!

శ్రీదేవి మరణంతో విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు ఆ బాధ నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. త్వరలో ఈ విషాదాన్ని పూర్తిగా మరిచిపోయి వేడుకలో మునగబోతోన్నారు. హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. సోనమ్ కపూర్…. శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కూతురు అనే సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కొన్ని రోజులుగా తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి పెళ్లి డేట్, వెన్యూ ఫిక్స్ అయింది. మే 11, 12 తేదీల్లో జెనీవాలో వీరి వివాహం జరుగబోతోందని తెలుస్తోంది. ప్రముఖ ఆంగ్లపత్రిక ముంబై మిర్రర్ కథనం ప్రకారం…గత వారం సోనమ్ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాతో కలిసి లండన్‌కు హాలిడే ట్రిప్ వెళ్లారు. ఈ సందర్భంగా వారు తమ పెళ్లి గురించి ఓ నిర్ణయానికి వచ్చారట. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాలో గడుపుతున్నారు. పెళ్లి వేడుక సందర్భంగా అతిథులందరినీ జెనీవా తీసుకెళ్లాలి కాబట్టి భారీ ఎత్తున ఫ్లైట్ బుకింగ్స్ చేయడం ప్రారంభించారని తెలుస్తోంది. సోనమ్ కపూర్ తండ్రి అనిల్ కపూర్ గెస్టులకు స్వయంగా ఫోన్లు చేస్తూ తన కూతురి పెళ్లికి ఇన్వైట్ చేస్తున్నారట. చాలా ఏళ్ల నుండి సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజా మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అనిల్ కపూర్ 60వ పుట్టినరోజు సందర్భంగా లండన్లో వీరు తమ రిలేషన్ షిప్ గురించి అందరికీ తెలిసేలా చేశారు.

To Top
error: Content is protected !!