క్రీడలు

వన్డేల్లో తిరుగులేని భారత ఓపెనర్-స్మృతీ మంధాన!

Smriti Mandhana retains top spot in ICC Women
వన్డేల్లో తిరుగులేని భారత ఓపెనర్-స్మృతీ మంధాన!

అంతర్జాతీయ స్థాయిలో పరుగుల వరద పారిస్తున్న భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతీ మంధాన ICC వన్డే ర్యాంకింగ్స్ లో మరోసారి అగ్రస్థానం అలంకరించింది. గతకొంతకాలంగా నిలకడగా రాణించడమే కాదు, భారీ స్కోర్లు సాధిస్తూ ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకోత కోస్తోంది.

ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో స్మృతీ బ్యాటింగ్ ప్రదర్శన పతాకస్థాయిలో సాగింది. వన్డే, T20 సిరీస్ లలో 3 అర్ధ సెంచరీలు, 1 సెంచరీతో సత్తా చాటింది ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ ఉమన్. గత ర్యాంకింగ్స్ లో కూడా స్మృతీ టాప్ ర్యాంక్ లో నిలిచింది.

తాజా ర్యాంకింగ్స్ జాబితాలో భారత సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్ ఐదవ స్థానంలో ఉంది. బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్ ఝులాన్ గోస్వామి మూడవ ర్యాంక్ పొందింది. ఆమె గత జాబితాలో కూడా అదే స్థానంలో ఉంది.

To Top
error: Content is protected !!