ఆరోగ్యం

భోజనం తక్కువ తినాలి అంటే ఇది చేస్తే చాలు!

Smelling Food Before Eating It Can Cause Weight Gain
భోజనం తక్కువ తినాలి అంటే ఇది చేస్తే చాలు!

నోరూరించేలా కంటిముందు ఏదైనా కనిపిస్తే, కడుపు నిండా లాగించేయాలని ఎవరికైనా అనిపిస్తుంది.ఇదే సమయంలో కొవ్వు పెరిగి ఊబకాయం వస్తుందన్న భయం కూడా వెంటాడుతుంటుంది.

అయితే, కంటి ముందు కనిపిస్తున్న ఆహార పదార్థాలను 2నిమిషాల పాటు వాసన చూస్తే, ఆపై ఆటోమేటిక్ గా తక్కువగా తింటారట. ఎక్కువ తినాలి అనుకున్న తక్కువే తింటారు అంట.

యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా రీసెర్చర్లు ఓ అధ్యయనం నిర్వహించి, ఈ విషయాన్ని కనుగొనగా, ‘మార్కెటింగ్‌ రిసెర్చ్‌’ అనే జర్నల్‌ దీన్ని ప్రచురించింది.రెండు నిమిషాలు వాసన చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది.

ఆ తర్వాత ఆహారం ఏది అయినా, తక్కువగానే తీసుకుంటామని, క్యాలరీలు పెరుగుతాయన్న భయం ఉండదని చెప్పింది.ఆహారం వాసన వల్ల సంతృప్తి లభించడమే దీనికి కారణమని వివరించింది. ఈ అధ్యయన బృందంలో ఓ ఇండియన్ ప్రొఫెసర్ కూడా ఉండటం గమనార్హం.

To Top
error: Content is protected !!