ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ కి మరో షాక్ ..? ఇద్దరు ఎంపీలు జంప్!

టీడీపీ కి మరో షాక్ ..? ఇద్దరు ఎంపీలు జంప్!

ఏపీలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల వేళ అధికార టీడీపీకి ఎవ్వ‌రూ ఊహించ‌ని షాకులు త‌గ‌ల‌నున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ నుంచి ఇత‌ర పార్టీల్లోకి జంప్ చేసేందుకు చాలా మంది వెయిటింగ్‌లో ఉన్నారు. ప‌వ‌న్‌, జ‌గ‌న్‌తో పాటు బీజేపీ కూడా ఇప్పుడు ప్ర‌ధానంగా చంద్ర‌బాబునే టార్గెట్ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీల ఉమ్మ‌డి శ‌త్రువు చంద్ర‌బాబే. ఈ క్ర‌మంలోనే రోజు రోజుకు బాబు ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త కూడా పెరుగుతోంది.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ నుంచి వైసీపీ, టీడీపీలోకి ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎలా జంప్ చేసేశారో ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల ముంగిట టీడీపీకి కూడా అదే ప‌రిస్థితి ఎదుర‌య్యేలా ఉంది. టీడీపీ నుంచి కొంత‌మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల‌తో పాటు ఒక‌రిద్ద‌రు మంత్రులు కూడా వైసీపీ, జ‌న‌సేన వైపు చూస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇవిలా ఉంటే ఇద్ద‌రు ఎంపీలు కూడా టీడీపీని వీడేందుకు రెడీగా ఉన్న‌ట్టు ఆయా జిల్లాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం చెపుతోంది. వీరిద్ద‌రు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌తో టీడీపీలో ఆ ఛాన్స్ లేద‌ని అర్థ‌మ‌వ్వ‌డంతో పార్టీ కండువా మార్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. వీరిలో కాకినాడ ఎంపీ తోట న‌ర‌సింహం వైసీపీలోకి వెళ్లి పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే ప్లాన్‌లో ఉన్నారు. మంత్రి అవ్వాల‌న్న‌దే తోట టార్గెట్‌.

ఇక అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌నుకుంటున్నారు. అయితే అక్క‌డ ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆయ‌న్ను అక్క‌డ‌కు రానిచ్చే ప‌రిస్థితి లేదు. ఆయ‌న కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అవ్వాల‌న్న టార్గెట్‌తోనే ఉన్నారు. భీమిలిలో టీడీపీ సీటు వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని తేల‌డంతో ఆయ‌న చూపులు జ‌న‌సేన వైపు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా టీడీపీకి ఎన్నిక‌ల ముందు భారీ కుదుపు త‌ప్పేలా లేదు.

To Top
error: Content is protected !!