ఆంధ్ర ప్రదేశ్

ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక-దక్షిణాదిపై ఉగ్రదాడులు

Seven states put on alert after terror attack call to police
ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక-దక్షిణాదిపై ఉగ్రదాడులు

శ్రీలంకలో ఇటీవల ఈస్టర్ పండుగ పర్వదినాన ఉగ్రవాదులు రెచ్చిపోయారు .. మానవ బాంబులతో దాడి చేసి అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నారు ..ఇప్పటికి శ్రీలంకలో బాంబు పేలుళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం మరో మూడు పేలుళ్లు జరిగాయి. ఇలాంటి సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రవాదులు ప్రవేశించారని తెలిసింది. శుక్రవారం రాత్రి కేంద్ర నిఘా సంస్థ ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి హెచ్చరికలు జారీ చేసింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి పోలీసులకు హెచ్చరికలు వెళ్లాయి. ముందుగా బెంగళూరు, మైసూరు నగరాల్ని ఉగ్రవాదులు టార్గెట్‌ చేసుకున్నారంటూ ఓ లారీ డ్రైవర్‌ కర్ణాటక పోలీసులకు సమాచారం అందించారు. అంతే… ఒక్కసారిగా కలకలం మొదలైంది. వెంటనే అప్రమత్తమైన నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. బెంగళూరు, మైసూర్‌లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది.

అన్ని వాహనాల్నీ తనిఖీ చేస్తున్నారు. హోటళ్లలో దిగిన వ్యక్తుల సమాచారం సేకరిస్తున్నారు. అలాగే… ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, షాపింగ్‌ మాల్స్‌, రద్దీ ప్రదేశాల్లో అంతటా అలర్ట్ కొనసాగుతోంది. ఇంటెలిజెన్స్ బ్యూరో జారీ చేసిన హెచ్చరికల్లో… తమిళనాడులోని రామంతాపూర్‌లో 19 మంది ఉగ్రవాదులు ఉన్నట్లు తెలిసింది. వాళ్లంతా ఒకే చోట కాకుండా… వేర్వేరుగా 19 ప్రదేశాల్లో పేలుళ్లకు కుట్రపన్నారని వివరించింది. అందువల్ల తమిళనాడు వ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది.

ఆ రాష్ట్ర పోలీసులు ఉగ్రవాదుల కోసం వేటాడుతున్నారు. శ్రీలంకలో వరస పేలుళ్ల తర్వాత ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాలని టార్గెట్‌ చేసుకున్నారనీ…. రైల్వేస్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను పెంచాలనీ ఆయా రాష్ట్రాల డీజీపీలను ఐబీ ఆదేశించింది. దాంతో అన్ని రాష్ట్రాలూ అలర్ట్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాలకూ ఉగ్రవాద ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా తరచూ హైదరాబాద్‌లో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వాహనాల రాకపోకలపై దృష్టి సారిస్తున్నారు.

To Top
error: Content is protected !!