తెలంగాణ

బిజెపి మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి మృతి!

Senior BJP leader Baddam Bal Reddy is no more
బిజెపి మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి మృతి!

బీజేపీ సీనియర్‌ నేత, మాజీ శాసనసభ్యుడు బద్దం బాల్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఈ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు బంజరాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు .. కాగా నేడు ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు .. కాగా గతంలో కార్వాన్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు బద్దం బాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పాతబస్తీ రాజకీయాల్లో బీజేపీ తరఫున కీలకంగా వ్యవహరించిన పాతతరం నేతల్లో బద్దం బాల్‌రెడ్డి ఒకరు. సీనియర్‌ రాజకీయ నాయకుడు అయిన ఆయన గతంలో అప్పటి ఎంఐఎం అధినేత సలావుద్దీన్‌ ఒవైసీకి గట్టి పోటీనిచ్చారు.

To Top
error: Content is protected !!