సినిమా

సంక్రాంతి యుద్ధంలో విజేత ఇతనే ….!

sankranthi festival success movie F2
సంక్రాంతి యుద్ధంలో విజేత ఇతనే ….!

ఈ రోజుతో సంక్రాంతి బరిలో దిగాల్సిన బాక్స్ ఆఫీస్ పుంజులన్ని దిగిపోయాయి . మొత్తం నాలుగూ స్టార్ హీరోలవే కాబట్టి బిజినెస్ కూడా రెండు వందల కోట్లకు పైగా సాగింది. మొదటి రెండు రోజుల ఓపెనింగ్స్ అభిమానుల అండతో నడిచిపోతాయి కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు బాగానే వచ్చాయి.

ఇప్పుడు సామాన్య ప్రేక్షకుల వంతు వచ్చింది. కుటుంబంతో కలిసి పండగ సమయంలో ఏదో ఒకటో లేదో రెండో చూసే ఛాన్స్ ఉంటుంది. అది ఏది అనే సందిగ్దత ఉండటం సహజం.

ఇప్పుడు అన్ని ఫలితాలు వచ్చేసినట్టే. విన్నర్ ఎవరూ అని తేల్చి చెప్పడానికి ఇంకా టైం పడుతుంది కాని ప్రస్తుతానికి ఉన్న రిపోర్ట్స్ రివ్యూస్ ప్రకారం ఫైనల్ గా రెండు బెటర్ ఛాయస్ లు జనానికి కనిపిస్తున్నాయి.

డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ తో పాటు మహానటుడు ఎన్టీఆర్ జీవితాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఎన్టీఆర్ కథానాయకుడికి ఓటు వేస్తున్నారు. అయితే మహానటి తరహాలో ఇందులో ఎమోషనల్ డ్రామా మరీ ఎక్కువ లేకపోవడంతో అందరిని రప్పించలేకపోతోంది.

ప్రమోషన్ విషయంలో ఎత్తుగడ మారిస్తే పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ వచ్చిన ఎఫ్2ని పండగ సినిమా అనే టాక్ తో సోషల్ మీడియాని ఊదరగొడుతున్నారు.

వెంకీ తన కామెడీ టైమింగ్ తో ఒంటి చేత్తో నిలబెట్టిన ఈ మూవీలో కంటెంట్ రొటీన్ గానే ఉన్నా హాస్యం కాస్త ఫ్రెష్ గా ఉండటంతో ఈ మాత్రం కూడా లేక గత కొంతకాలంగా కరువులో ఉన్న ప్రేక్షకులకు ఇది పన్నీటి జల్లులా మారింది.

ఫ్యామిలీ ఆడియన్స్ దీని వైపే మొగ్గు చూపుతున్నారని పెరుగుతున్న బుకింగ్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి.ఇక వినయ విధేయ రామ ఇప్పటికైతే వసూళ్ళ పరంగా ఓకే అనిపిస్తోంది కాని టాక్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.

వారం దాటాక గడ్డు పరిస్థితి తప్పేలా లేదు. ఇక రజనికాంత్ పేటలో స్టైల్ తప్ప రొటీన్ కథతోనే లాగించారన్న మాట వినిపించడంతో పాటు థియేటర్ల కొరత బాగా ప్రభావం చూపించింది.

సో యావరేజ్ అనిపించుకోవడం కూడా కష్టంగానే ఉంది. మొత్తానికి విభిన్న సినిమా అంటే ఎన్టీఆర్ పండగ ఛాయస్ అంటే ఎఫ్2 అనేలా సాగుతోంది సంక్రాంతి సందడి

To Top
error: Content is protected !!