సినిమా

అతనితో నన్ను పడుకోమన్నాడు- సంజన!

అతనితో నన్ను పడుకోమన్నాడు- సంజన!

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఆడియన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే సంజన ఎలిమినేషన్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సంజన ప్లేస్ లోకి నందిని రాయ్ జాయిన్ అయింది. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే తనతో బిగ్ బాస్ నిర్వాహకులు గేమ్ ఆడుకున్నారని, హౌస్ లోపల మొత్తం రాజకీయం జరిగింది అని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. బిగ్ బాస్ 2 నుంచి బయటకు వచ్చిన సంజన ఇంటర్వ్యూలలో చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నన్ను ఎంపిక చేయడం మొదలు కుని ఎలిమినేట్ చేయడం వరకు పెద్ద రాజకీయమే జరిగిందని సంజన సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. బిగ్ బాస్ నుంచి ఎలిమినేటి అయిన సంజన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. మొదట బిగ్ బాస్ 2 కి నందిని రాయ్ ఎంపిక జరిగింది. కానీ ఆమెకు ఒంట్లో బాగాలేకపోవడంతో ఆ ప్లేస్ లో నన్ను ఎంపిక చేశారు. వారం తిరిగేసరికి నందిని కోలుకోవడంతో నన్ను బయటకు గెంటేశారు అని సంజన ఆరోపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోపల జైల్లో పెట్టి హింసించారని సంజన వాపోయింది. తాను ఏ తప్పు చేయకపోయినా ప్లాన్ ప్రకారమే బయటకు పంపారని సంజన తెలిపింది.
తనకు నూతన నాయుడుతో అప్పటికి గంట పరిచయం మాత్రమే. తామిద్దరిని ఒకే బెడ్ ఉండే జైల్లో వేశారు. అదే బెడ్ పై ఇద్దరూ పడుకోండి అని చెప్పిన వారు కూడా ఉన్నారు. అదెలా సాధ్యం అని అడిగితే మధ్యలో దిండు అడ్డు పెట్టుకోండి అని సలహా ఇచ్చారు. గంట పరిచయం ఉన్న వ్యక్తితో ఎలా పడుకుంటాను. ఒక ఏజ్ వచ్చాక అమ్మాయి కనీసం నాన్న పక్కన కూడా పడుకోదు అని సంజన మండిపడింది.

To Top
error: Content is protected !!