అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
క్రీడలు

ఐపీఎల్ కోచ్‌లు..వారి వేతనాలు ఎంతో తెలుసా?

salaries of coaches and mentors in ipl
ఐపీఎల్ కోచ్‌లు..వారి వేతనాలు ఎంతో తెలుసా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆటగాళ్ల వేలం ప్రక్రియలో ప్లేయర్స్ కోసం ఆయా ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరిస్తుంటాయి. స్టార్ హిట్టర్లు, మ్యాచ్‌ను మలుపుతిప్పే ప్రతిభావంతులైన వారి కోసం పోటీపడతాయి. బయటి ప్రపంచానికి అనూహ్యంగా అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాళ్లు, వేలంలో నిరాశకు గురైనవారి గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఆటగాళ్లతో మంచి జట్టుగా తయారు చేసి, తెరవెనుక ఉండి వ్యూహాలు రచించి టీమ్‌ల విజయాల్లో ప్రధాన పాత్ర పోషించేది కోచ్‌లే. రెండు నెలల పాటు ఆటగాళ్లతో ప్రయాణించే కోచ్‌ల వేతనాలపై ఓ లుక్కేద్దాం!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రధాన కోచ్ డేనియల్ వెటోరీ ఐపీఎల్‌లో మిగతా కోచ్‌ల కన్నా అత్యధిక వేతనాన్ని అందుకుంటున్నట్లు సమాచారం. అతని తరువాత ఆ ఫ్రాంఛైజీ బౌలింగ్ కోచ్ ఆశీష్ నెహ్రా రూ.4కోట్లు పారితోషికం పొందుతున్నాడు. బ్యాటింగ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ రూ.1.5కోట్లు తీసుకుంటున్నాడు.

కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ ప్రధాన కోచ్ జాక్వెస్ కలిస్, ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్దనే చెరో రూ.2.25 కోట్లు వేతనంగా పొందుతున్నారు.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్ రికీ పాంటింగ్ దాదాపు 3.7 కోట్లు.
చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ రూ.3.2కోట్లు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్‌కు రూ.3కోట్లు.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ మెంటార్ షేన్ వార్న్ రూ.2.7కోటు.
ముంబయి ఇండియన్స్ బౌలింగ్ మెంటార్ లసిత్ మలింగ రూ.1.5కోట్లు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ టామ్ మూడీ, మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ చెరో రూ.2కోట్లు వేతనంగా పోందుతున్నారు.

To Top
error: Content is protected !!