సినిమా

‘ఆర్ ఎక్స్ 100’ హీరోయిన్ పారితోషికం మరి ఇంతేనా?

'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్ పారితోషికం మరి ఇంతేనా?

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ .. పాయల్ రాజ్ పుత్ జంటగా ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా తెరకెక్కింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విజయవిహారం చేస్తోంది. ఈ సినిమాకిగాను పాయల్ రాజ్ పుత్ తీసుకున్న పారితోషికం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాలో యాక్షన్ తో పాటు రొమాన్స్ పాళ్లు ఎక్కువే. ఈ సినిమాలో లిప్ లాక్ లు చాలానే వుంటాయని దర్శకుడు ముందుగానే చెప్పడం వలన, చాలామంది కథానాయికలు ఈ ఆఫర్ ను తిరస్కరించారు.

ఒకానొక సమయంలో హీరోయిన్ దొరకడం కష్టమే అనే స్థితికి వచ్చేశారట. అలాంటి పరిస్థితుల్లో పాయల్ రాజ్ పుత్ ప్రస్తావన రావడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాలోని రొమాంటిక్ సీన్స్ చూసిన వాళ్లు .. అందుకు తగినట్టుగా ఆమె బాగానే డిమాండ్ చేసి ఉంటుందని అనుకోవడం సహజం. కానీ పారితోషికంగా ఆమెకి ముట్టినది కేవలం 6 లక్షలేననే మాట ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయం గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. పారితోషికం కన్నా ఆ తరువాత వచ్చే ఛాన్సులపై ఆమె దృష్టి పెట్టి వుంటుందని చెప్పుకుంటున్నారు.

To Top
error: Content is protected !!