అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
తెలంగాణ

మిర్యాలగూడ పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు

మిర్యాలగూడ పరువు హత్య కేసులో విస్తుపోయే నిజాలు

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ మర్డర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురు కులాంతర వివాహం చేసుకుని తన పరువు తీసిందన్న కారణంగా కిరాయి హంతకుల చేత అల్లుడిని దారుణంగా హతమార్చాడు మారుతీరావు. పరారీలో ఉన్న మారుతిరావును హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా పరువుకోసమే ప్రణయ్ ను హత్య చేయించినట్టు మారుతీరావు ఒప్పుకున్నాడు. తొమ్మిదో తరగతిలోనే తన కూతురు వెంట పడొద్దని ప్రణయ్‌ను హెచ్చరించానని అయినా మారలేదని, అందుకే చంపించానని ఒప్పుకున్నాడు. తన కూతురు మీద ప్రేమతోనే అతని హత్యకు ప్లాన్‌ చేశానన్నాడు.

కూతరికి ఎలాంటి హానీ తలపెట్టొద్దని సుఫారీ గ్యాంగ్‌కు ముందే చెప్పినట్టు పోలీసుల ముందు నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రణయ్ హత్యకోసం కిరాయి హంతకులతో10 లక్షలతో బేరం కుదుర్చుకుని ముందుగా ఐదు లక్షలు ఇచ్చినట్టు మారుతీరావు ఒప్పుకున్నాడు. కాగా ఈ కేసులో ఆయన తమ్ముడు శ్రవణ్‌‌కుమార్‌ ఏ2 నిందితుడుగా ఉన్నారు. శుక్రవారం ఘటన తరువాత కారులో పారిపోయిన నిందితులను సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా గురించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగి పోలీసులు నిన్న (శనివారం) అదుపులోకి తీసుకున్నారు..

To Top
error: Content is protected !!