ఆంధ్ర ప్రదేశ్

జగన్ తో భేటీ అయినా మోత్కుపల్లి.. కారణం ఇదేనా

reason behind motkpalli met jagan
జగన్ తో భేటీ అయినా మోత్కుపల్లి.. కారణం ఇదేనా

తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయినా మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటూ జగన్‌తో చర్చలు జరిపారు. జగన్‌తో సమావేశంలో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది.

జగన్-మోత్కుపల్లి భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. శనివారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ఆహ్వానిస్తే టీఆర్ఎస్‌లోకి చేరేందుకు సిద్ధమన్నారు మోత్కుపల్లి. మండవ వెంకటేశ్వరరావును సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించడాన్ని స్వాగతించారు. తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైందని.. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. చంద్రబాబు ఓ అసమర్థుడు.. ఏపీలోనే దిక్కులేదు.. ఇక తెలంగాణకు ఏం చేయగలరన్నారు..

అలాగే ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్నారు. ఏపీలో మాల, మాదిగలంతా వైసీపీకి మద్దతు పలకాలన్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోత్కుపల్లిని టీడీపీ సస్పెండ్ చేసింది. తర్వాత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.. ఒక సమయం లో ఆయన పవన్ కళ్యాణ్ ను కలిశారు . దింతో మోత్కుపల్లి కి తెలంగాణ జనసేన పగ్గాలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి . కానీ ఆ వార్తలు ప్రచారానికే పరిమితమయ్యాయి .. అయితే మోత్కుపల్లి వైసిపి కి తన మద్దతు తెలియజేయడానికి జగన్ కలిసారని అంటున్నారు .. .

To Top
error: Content is protected !!