సినిమా

బాహుబలి ముందు రోబో 2. 0 బొక్కబోర్లా-సంచలన ట్రేడ్ రిపోర్ట్!

Rajinikanth and Akshay Kumar's 2.0 Beats bhahubali collections
బాహుబలి ముందు రోబో 2. 0 బొక్కబోర్లా-సంచలన ట్రేడ్ రిపోర్ట్!

ప్రముఖ దర్శకుడు శంకర్ డైరక్షన్ లో రజనీకాంత్‌ హీరోగా రూపొందిన చిత్రం 2.o. లైకా సంస్థ సుమారు రూ.550 కోట్లతో రూపొందించింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో భారీ అంచనాల మధ్య ఈ రోజున విడుదలైంది .., ఇప్పటికే ఈ చిత్రం ప్రీమియల్ షోలు యుఎస్ లో పడ్డాయి .., ఈ మూవీ యూఎస్ఏ రైట్స్ ప్రైమ్ మీడియా సంస్థ దక్కించుకుంది.., ఈ రిపోర్టుకి బాహుబలి రిపోర్టుకి అప్పుడే కంపారిజాన్స్ మొదలైపోయాయి ..,

బాహుబలి 2 సినిమా విడుదల ముందే ప్రీ టికెట్ సేల్స్ $3 మిలియన్ల మేర జరిగింది. యూఎస్ఏ ప్రీమియర్స్ ద్వారా $3.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీన్ని 2.0 చిత్రం అధిగమిస్తుందని అంతా భావించారు. అయితే బుధవారం యూఎస్ఏ వ్యాప్తంగా వేసిన ప్రీమియర్ షోలకు ఆశించిన మేర ఆదరణ లభించలేదట. అందుకే యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా కలెక్షన్ల వివరాలు బయటకు వెల్లడించలేదనే టాక్ వినిపిస్తోంది. యూఎస్ఏ ఆడియన్స్ 3డి సినిమాలు నార్మల్ రేటుకే చూస్తుంటారు.

అయితే రజనీకాంత్ 2.0 మూవీకి మాత్రం వారు 30 డాలర్లు వెచ్చించాల్సి వస్తోందట. అందుకే ప్రీమియర షోలకు ఆదరణ తగ్గిందని, ప్రీ టికెట్ సేల్స్ అక్కడ తక్కువగా జరుగడానికి కారణం కూడా అదే అని అంటున్నారు. అయితే యూఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రైమీడియా వాదన మరోలా ఉంది. ప్రీమియర్ షోలకు ఏర్పాట్లు సరిగా జరుగలేని, ఫస్ట్ డే నుంచి అంతా సక్రమంగా ఉంటుందని ట్వీట్ చేయడం గమనార్హం. మరో వైపు ఇండియాలో 2.0 టికెట్ సేల్స్ అదిరిపోతున్నాయి. బుక్ మైషో ద్వారా 1 మిలియన్, పేటీఎం ద్వారా 1.25 మిలియన్ టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ నెంబర్స్ బట్టి 2.0 సినిమాపై భారతీయ ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

To Top
error: Content is protected !!