క్రీడలు

చెన్నైపై రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం

rajastan royals won against CSK by 4 wickets
చెన్నైపై రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం

ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. జైపూర్ వేదికగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్స్ రేసులో ఆశలను సజీవంగా ఉంచుకుంది. చెన్నై నిర్ధేశించిన 177పరుగుల లక్ష్య ఛేదనను రాజస్థాన్ రాయల్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి రాజస్థాన్ రాయల్స్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. తాజా విజయంతో రాజస్థాన్ రాయల్స్ 10 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకింది.

To Top
error: Content is protected !!