సినిమా

రాజమౌళి మల్టీస్టారర్‌పై కీలక ప్రకటన..

rajamouli to make announcement about multistarrer with ram charan and ntr
రాజమౌళి మల్టీస్టారర్‌పై కీలక ప్రకటన..

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది.. కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయి… అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు.

ఈ నెల 20న ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రకటన వెలువడనుందన్న ప్రచారం జరుగుతోంది. 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ భారీ మల్టీస్టారర్‌కు సంబంధించి రాజమౌళి కీలక ప్రకటన చేయనున్నారట. అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ లేకపోయినా.. మెగా మల్టీస్టారర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ రావటం ఖాయమని తెలుస్తోంది. అంతేకాదు అదే రోజు ఎన్టీఆర్‌, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్ చేయనున్నారు..

To Top
error: Content is protected !!