సినిమా

క్యాన్సర్ బారిన చిరంజీవి స్టార్ హీరోయిన్..,

క్యాన్సర్ బారిన చిరంజీవి స్టార్ హీరోయిన్..,

సోషల్ మీడియా పుణ్యమా అని వాస్తవాల కంటే అబద్ధాలే ఎక్కువ ప్రచారం అవుతున్నాయి. జనాలు కూడా అది నిజమా?, అబద్ధమా? అనే విషయాన్ని నిర్ధారించుకోకుండా… తమ వంతుగా తప్పుడు ప్రచారాన్ని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలకు చెందిన వార్తలయితే, మరింత వేగంగా విస్తరిస్తాయి. బతికున్న వారిని కూడా చనిపోయినట్టు ప్రచారం చేయడంలో సోషల్ మీడియా పోషిస్తున్న పాత్ర చాలా గొప్పది. తాజాగా సీనియర్ నటి రాధికకు సంబంధించి ఓ తప్పుడు ప్రచారం జరుగుతోంది. రాధిక గత కొంత కాలంగా కేన్సర్ తో బాధపడుతున్నారనేదే ఆ వార్త. క్యాన్సర్ కారణంగా ఆమె బయట కూడా కనిపించడం లేదనే పుకారు సోషల్ మీడియా ద్వారా తమిళనాట వైరల్ అవుతోంది. ఇక ఎన్ని రోజులైనా కూడా రాధికా గాని ఆవిడ కుటుంబ సభ్యులు కానీ ఈ వార్తలపై స్పందించకపోవడంతో కొందరు నేరుగా రాధికకు , ఆవిడ హస్బెండ్ శరత్ కుమార్ ని కూడా ఫోన్లో కాంటాక్ట్ చేసారని తెలుస్తుంది .. ఇక ఎలాగైనా ఈ వార్తలను ఆపాలని డిసైడ్ అయ్యిందట రాధికా .., అనుకోకుండా దీనికి సంబంధించి ఓ అభిమాని ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా రాధికను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన ఆమె… అదంతా తప్పుడు ప్రచారమేనని, తాను నిక్షేపంగా ఉన్నానని తెలిపారు.

https://twitter.com/realradikaa/status/998606100696940545

To Top
error: Content is protected !!