సినిమా

కొడుకుతో ‘రొమాంటిక్’ చేయబోతున్న పూరి జగన్నాథ్!

Puri Jagannatha's son's next has a title
కొడుకుతో ‘రొమాంటిక్’ చేయబోతున్న పూరి జగన్నాథ్!

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ పూరిని ‘మెహబూబా’ సినిమా ద్వారా గతేడాది లాంచ్ చేశారు కానీ సినిమా బాక్పాఫీసు వద్ద వర్కౌట్ కాలేదు. ఎలాగైనా ఆకాష్‌ను ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్న పూరి… సెకండ్ మూవీ అనౌన్స్ చేశారు.

‘రొమాంటిక్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈచిత్రాన్ని స్వయంగా పూరి జగన్నాథ్ నిర్మించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చారు. అయితే డైరెక్షన్ మాత్రం తన శిష్యుడు అనిల్ పాడూరికి అప్పగించారు. ఇంతకు ముందు తన డైరెక్షన్లో చేసిన ‘మెహబూబా’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవ్వడంతో ఈ సారి పూరి ఆ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు.

ఇది ప్రేమకథా చిత్రమని టైటిల్‌‌లోనే హింట్ ఇచ్చిన పూరి… గత చిత్రంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. చిత్ర నిర్మాతల్లో ఒకరైన చార్మి స్పందిస్తూ… ‘ఈసారి ఒక అందమైన ప్రేమకథను అందించబోతున్నాం. మీ అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంది’ అని ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

To Top
error: Content is protected !!