క్రీడలు

భారతదేశం లో పబ్ జి గేమ్ ను నిషేదిస్తున్నారా?

PUBG Ban in India by 'High Court of Maharashtra' Is Fake News
భారతదేశం లో పబ్ జి గేమ్ ను నిషేదిస్తున్నారా?

ప‌బ్‌జి… ఇప్పుడీ గేమ్ గురించి పెద్ద‌గా చెప్ప‌నక్క‌ర్లేదు. యువ‌త‌, పిల్ల‌లు ఈ గేమ్‌కు అడిక్ట్ అయిపోయారు. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు, రాత్రి నిద్రించే వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా విహ‌రించే వారు ఇప్పుడు ప‌బ్‌జి మాయ‌లో ప‌డిపోయారు అయితే ప‌బ్‌జి వ‌ల్ల యువ‌త, చిన్నారుల్లో హింసా ప్ర‌వృత్తి పెరిగిపోతుంద‌ని, వారు ఆ గేమ్‌ను ప్రేర‌ణ‌గా పొంది హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని, క‌నుక ఈ గేమ్‌ను వెంట‌నే మ‌న దేశంలో నిషేధించాల‌నే వార్త ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

ప‌బ్‌జి గేమ్‌ను ఇండియాలో నిషేధించాల‌నే వార్త ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అది నిజ‌మేన‌ని న‌మ్మేట్లుగా మ‌హారాష్ట్ర హైకోర్టు జ‌డ్జి ఓ ఉత్త‌ర్వును కూడా జారీ చేశారు, చూసుకోండి అంటూ.. ఓ లెట‌ర్ కూడా మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తోంది. ఈ క్ర‌మంలోనే జ‌న‌వ‌రి 1, 2019వ తేదీ నుంచి ప‌బ్‌జి ని మ‌న దేశంలో బ్యాన్ చేస్తార‌నే వార్త కూడా ఊపందుకుంది. అయితే ఈ వార్త‌ల‌ను నిజ‌మే అని న‌మ్మిన ప‌బ్‌జి ప్రియులు ఆందోళ‌న చెందుతున్నారు.

ప‌బ్‌జి బ్యాన్ అయితే త‌మ ప‌రిస్థితి ఏమిట‌ని వారు క‌ల‌త చెందుతున్నారు. కానీ నిజానికి అస‌లు ఆ లెట‌ర్ అంతా వట్టిదేన‌ని, అది ఎంత మాత్రం నిజం కాద‌ని, కొంద‌రు ఇలా చేశార‌ని.. ప‌లు మీడియా సంస్థ‌లు ఇప్ప‌టికే తేల్చేశాయి. అయితే దీనిపై ప‌బ్‌జి గేమ్ డెవ‌ల‌ప‌ర్ టెన్సెంట్ గేమ్స్ మాత్రం ఇంకా స్పందించ‌లేదు. కానీ ఆ లెట‌ర్ మాత్రం వ‌ట్టి బూట‌క‌మే అని పేర్కొంటున్నారు . అయితే ప‌బ్‌జి గేమ్ షూటింగ్ త‌ర‌హా గేమ్ క‌నుక దాన్ని ఆడేవారిలో హింసాత్మ‌క ప్ర‌వృత్తి పెరుగుతుంద‌ని చెప్పి భ‌విష్య‌త్తులో ఎవ‌

To Top
error: Content is protected !!