తెలంగాణ

మగబిడ్డకు జన్మనిచ్చిన మిర్యాలగూడ ప్రణయ్ భార్య “అమృత”!

మిర్యాలగూడలో చోటు చేసుకున్న ప్రణయ్ పరువుహత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హత్య జరిగే నాటికే ప్రణయ్ భార్య అమృత ఐదు నెలల గర్భవతి. ఇప్పుడు ఆమె మిర్యాలగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

ప్రణయ్ మళ్లీ తమ మధ్యకు వచ్చాడని, కుటుంబసభ్యులంతా సంతోషపడుతున్నారు. బిడ్డ కోసం తాను బతుకుతానని అమృత తెలిపింది.
అమృత, ప్రణయ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రణయ్ హత్య తర్వాత అమృత తన అత్తింటి వద్దే ఉంటోంది.

కులాలు వేరైనా ప్రణయ్‌కుమార్‌, అమృత ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. సంతోషంగా తమ కాపురాన్ని సాగిస్తున్నారు. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వస్తుండగా, ప్రణయ్ ను కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు.

దీంతో ప్రణయ్ మరణించాడు. ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావు ఏ1 నిందితుడిగా ఉండగా, అమృత బాబాయ్ శ్రవణ్ ఏ2గా ఉన్నారు.

To Top
error: Content is protected !!