అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
తెలంగాణ

ప్రణయ్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించిన తమ్ముడు

ప్రణయ్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించిన తమ్ముడు

పరువు హత్యకు గురయిన ప్రణయ్ తమ్ముడు అజయ్‌ ఉక్రెయిన్‌ నుంచి మిర్యాలగూడ చేరుకున్నారు. అన్న మృతదేహాన్ని చూసి తమ్ముడు బోరున విలపించాడు. అజయ్ ఇంటికి రావడంతో అతడిని చూసిన కుటుంబసభ్యులు బోరున విలపించారు. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. వారి రోదనలు విన్న స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. మరికాసేపట్లో భారీ బందోబస్తు మధ్య ప్రణయ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రణయ్‌కు పలువురు దళిత సంఘాల నేతలు నివాళులర్పించారు. అమృత తండ్రి మారుతీరావు ఇంటి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ చర్చిబజార్‌ వాస్తవ్యుడు, ఎస్సీ (మాల) సామాజిక వర్గానికి చెందిన పెరుమాళ్ల ప్రణయ్‌(24) బీటెక్‌ పూర్తి చేసి కెనడా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రణయ్‌ తండ్రి బాలాస్వామి మిర్యాలగూడ ఎల్‌ఐసీ బ్రాంచ్‌లో పనిచేస్తున్నాడు. స్థానిక రియల్టర్‌, బిల్డర్‌.. వైశ్య సామాజిక వర్గానికి చెందిన తిరునగరు మారుతి రావు ఏకైక కుమార్తె అమృత బీటెక్‌ చదువుతోంది. ఇద్దరూ హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే ప్రేమలో పడ్డారు. విషయాన్ని కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. కులాలు వేరు కావడంతో అమృత తండ్రి మారుతిరావు ఈ పెళ్లికి ఇష్టపడలేదు. తన కూతురిని వదులుకుంటే రూ. 3 కోట్లు ఇస్తానని ప్రణయ్‌కు ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే అమృతను ఇంట్లో నుంచి తీసుకెళ్లిన ప్రణయ్‌.. హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఆమెను పెళ్లిచేసుకున్నాడు.

To Top
error: Content is protected !!