నేషనల్

పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.4 పెంపు!

petrol and diesel prices will hike by 4 rupees
పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.4 పెంపు!

పెట్రోల్ బాంబు మరోసారి పేలడానికి సిద్ధంగా ఉంది. కర్ణాటక ఎన్నికల ముందు 19 రోజుల పాటు ధరలు పెంచనందుకు ప్రతిగా ఇప్పుడా నష్టాన్ని భర్తీ చేసుకునే పనిలో ఆయిల్ కంపెనీలు ఉన్నట్లు బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. ఆ లెక్కన లీటర్‌కు రూ.4 పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 24 నుంచి మే 12 వరకు రోజువారీ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించలేదు. ఎన్నికలు పూర్తయిన రెండోరోజే రోజువారీ పెంపును మళ్లీ మొదలుపెట్టాయి. 

ఈ నాలుగు రోజుల్లోనే పెట్రోల్‌పై లీటర్‌రు 69 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర ఐదేళ్ల గరిష్ఠానికి చేరింది. ఇక డీజిల్ ధర 86 పైసలు పెరగడంతో ఆల్‌టైమ్ హైని తాకింది. అయితే ఎన్నికల ముందు ధరలు పెంచకపోవడం వల్ల కంపెనీల సాధారణ గ్రాస్ మార్కెటింగ్ మార్జిన్స్ తగ్గిపోయాయని, వాటిని అందుకోవడానికి వచ్చే వారాల్లో డీజిల్‌పై లీటర్‌కు రూ.3.5 నుంచి రూ.4 వరకు.. పెట్రోల్‌పై రూ.4 నుంచి రూ.4.55 వరకు పెంచే అవకాశం ఉన్నట్లు కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ వెల్లడించింది. 

అంతర్జాతీయంగా ధరలు పెరిగినా కర్ణాటక ఎన్నికల ముందు ధరలు పెంచకపోవడంతో లాభాలు తగ్గిపోయినట్లు ఆ సంస్థ తెలిపింది. ధరలు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం కారణంగా ఆయిల్ కంపెనీలు రూ.500 కోట్లు నష్టపోయినట్లు అంచనా.

To Top
error: Content is protected !!