ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీఆర్ పై నోరుజారిన పవన్ కళ్యాణ్!

Pawan kalyan sensational comments on NTR
ఎన్టీఆర్ పై నోరుజారిన పవన్ కళ్యాణ్!

సినిమాలలో పూలపాన్పుని వదిలేసి తంత్ర కుతంత్రాల రాజకీయాల్లో చెలరేగిపోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ . ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవర్ని వదలకుండా అందరిపై పంచులు వేస్తూ , జనసేన కార్యకర్తలకు ఎనలేని ఉత్సహం నింపుతున్న పవన్ కళ్యాణ్ మొన్నటి వైజాక్ పర్యటనలో ఏకంగా ఎన్టీఆర్ నే టార్గెట్ చేసాయడం సంచలనంగా మారింది .

మా రక్తం వేరు మా బ్రీడ్ వేరంటూ, తనేదో దైవాంశ సంబుధుడిలా , మిగితా మానవాళిని అవమానించేల మాట్లాడాడు అంటూ నాగబాబు వరుస ఎపిసోడ్స్ అయిపోయాక అంత సర్దుమణిగింది అనుకునే సమయానికి తమ్ముడు పవన్ చేసాడా అని మీడియాలో అనుమానాలు వస్తున్నాయి . ఒక ప్రజా సభలో పవన్ ప్రసంగిస్తూ , ” మనుషులు ఎదిగే కొద్దీ వొదిగి ఉండాలని నేను అనుకుంటాను .

అందరి మనుషుల్లో గాడ్ ఫ్యాక్టర్ ఉంటుంది , అందుకే నేను అందర్నీ ఒకేలా అబిమన్స్తను గౌరవిస్తాను , ఎదుగుతున్నకొద్దీ ఇంకా గౌరవించాలి అంటూ మా బ్రెడ్ వేరు అన్న బాలయ్యకు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇస్తూనే , ఎన్టీఆర్ పై డైరెక్ట్ అటాక్ చేసాడు . అప్పట్లో తెలంగాణ ఎన్నికల్లో పెద్ద ఎన్టీఆర్ గారు ఒకమాట అన్నారట . నేను కల్వకుర్తిలో కుక్కను నిలబెట్టిన గెలుస్తాను అని , కానీ నాకు అల ఉండదు .

రాజకీయంగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన అలాంటి కామెంట్స్ నేను చెయ్యలేను అంటూ సీనియర్ ఎన్టీఆర్ లోని లోపాల్ని ఎత్తిచూపే ప్రయత్నం పవన్ ఎందుకు చేసాడో అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ఆయన ఉద్దేశ పూర్వకంగా ఆలా మాట్లాడాడో లేక నోరుజారాడో తెలీదు కానీ , ఎన్నికల సమయం కావడంతో నందమూరి ఫాన్స్ మాత్రం పవన్ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకోవాలని నందమూరి ఫాన్స్ అప్పుడే నెట్లో ట్రోలింగ్ మొదలుపెట్టేసారు .

To Top
error: Content is protected !!