ఆంధ్ర ప్రదేశ్

గోదావరిలో లాంచీ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం…

pawan kalyan responds on godavari river boat accident
గోదావరిలో లాంచీ ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం...

గోదావరిలో లాంచీ ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాద విషయం తెలియగానే గుండె బరువెక్కింది అన్నారు. గిరిజనులు జలసమాధికావడం బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని తమపార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం గిరిజనులకు శాపం కావద్దు అన్నారు. జవాబుదారీతనంలేని పాలనా విధానాల వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల వద్దకు పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి.. గిరిజనులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కృష్ణానది ప్రమాదం మర్చిపోకముందే గోదావరిలో లాంచి ప్రమాదం చోటు చేసుకోవడంపై విచారం వ్యక్తం చేశారు.

To Top
error: Content is protected !!