ఆంధ్ర ప్రదేశ్

కర్ణాటక ఫలితాలు నాకు ముందే తెలుసు..పవన్ కళ్యాణ్

pawan kalyan about madala ranga rao
కర్ణాటక ఫలితాలు నాకు ముందే తెలుసు..పవన్ కళ్యాణ్
ఎన్ని సీట్లు వచ్చినా కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ముందే తనకు తెలుసు అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వాళ్ల వ్యూహాలు వాళ్లకు ఉన్నాయన్న విషయాన్ని కొందరు అధికారులు తనతో నెల రోజుల క్రితమే చెప్పారన్నారు. బీజేపీకి 85 సీట్లు వచ్చి.. జేడీఎస్‌కి 40 సీట్లు వచ్చినా.. బీజేపీదే అధికారమని వాళ్లు తనతో అన్నారని పవన్ చెప్పారు. ఇది తప్పా ఒప్పా అంటే అందరిలోనూ లోపాలున్నాయన్నారు. దశాబ్దాలుగా ప్రజాస్వామ్య పద్ధతులను నీరుగార్చారని.. ఇవాళ కర్ణాటకలో జరుగుతున్నది దానికి మరో ఉదాహరణ అని తెలిపారు. బీజేపీ మాత్రమే కాదని టీడీపీ, వైసీపీ ఇలా అన్ని పార్టీలు చేస్తున్నాయన్నారు. బేరసారాలకు చరమాంకం పలకాలని కోరుకునే సమూహంలో తానూ ఒకడినన్నారు పవన్.
 మరోవైపు ఈనెల 20 నుంచి జనసేన పోరాట యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఇచ్చాపురం తీరప్రాంతం నుంచి పోరాట యాత్ర ప్రారంభిస్తామన్నారు. 45రోజుల పాటు కొనసాగనున్నదని అన్నారు. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కవాతు నిర్వహిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా, ఇతర హామీలు కేంద్రం నెరవేర్చలేదని.. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు.
To Top
error: Content is protected !!