ఆంధ్ర ప్రదేశ్

మేము అధికారంలోకి వస్తే ఆ పని మొదట చేస్తాం: పవన్ కల్యాణ్‌

pawan kalyan about elections
మేము అధికారంలోకి వస్తే ఆ పని మొదట చేస్తాం: పవన్ కల్యాణ్‌

ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్ర ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విశాఖపట్నంలోని అంబేద్కర్‌ భవన్‌లో నిన్న నిద్ర చేసిన పవన్‌ కల్యాణ్‌ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్యమాల పుట్టినిల్లయిన శ్రీకాకుళం నుంచే తమ యాత్ర ప్రారంభమవుతుందని, 45 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు.

అలాగే సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాల తీరుకు నిరసనగా అన్ని నియోజక వర్గాల్లో నిరసన కవాతు నిర్వహిస్తామని పవన్ అన్నారు. మనకు రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలని, బీజేపీ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు.

పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం బాధాకరమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన ప్రభుత్వం వస్తే అన్ని జిల్లాల్లో అమరుల స్మారక చిహ్నాలు పెడతామని, 2019 ఎన్నికలే లక్ష్యంగా తాము పనిచేస్తామని పవన్ కల్యాణ్‌ తెలిపారు.

To Top
error: Content is protected !!