ఆంధ్ర ప్రదేశ్

పవన్, నాగబాబు వ్యాఖ్యలు పక్కా వ్యూహమే-సంచలన నిజం!

Pawan and Naga Babu comments are a good strategy
పవన్, నాగబాబు వ్యాఖ్యలు పక్కా వ్యూహమే-సంచలన నిజం!

అప్పుడెప్పుడో బాలయ్య బాబు .. చిరంజీవి ,పవన్ కళ్యాణ్ లపై విమర్శలు చేశారని ..ఇప్పుడు గుర్తుచేసుకొని మరి మెగాబ్రదర్ నాగబాబు ఆరు కామెంట్స్ చేశాడు .అయితే హఠాత్తుగా నాగబాబు ఇలా వ్యవహరించడం వెనుక పక్కా వ్యూహం దాగి ఉన్నట్టు అర్ధమవుతుంది .. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన సామాజిక వర్గం మొత్తం ఏకమైపోయింది.

అయితే ఇప్పుడు జనసేన విషయానికి వస్తే ..అప్పటి ఊపులో పదిశాతం కూడా లేదట . చిరు సమాజికవర్గ నేతలెవరూ.. అప్పట్లో పీఆర్పీలో చేరినట్లుగా.. ఇప్పుడుజనసేనలో చేరడం లేదు. డీఈనికి తోడు జనసేనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నేరుగా వెళ్లి పవన్ కల్యాణ్ ఆహ్వానిస్తున్న కొంత మంది కాపు సామాజికవర్గ ప్రముఖులు కూడా జనసేలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు వీరందర్నీ మళ్లీ ఏకతాటిపైకి తేవడానికే… పవన్ కల్యాణ్, నాగబాబు వ్యూహాత్మకంగా.. మాట్లాడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీని నమ్ముకున్న కాపు నేతలు.. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు.. అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు. పీఆర్పీ దెబ్బకు బాగుపడింది ఎవరూ అంటే.. ఒక్క చిరంజీవి అన్న పేరు మాత్రమే వస్తుంది.

ఆయనను నమ్ముకున్న ఇతర నేతలు.. దారుణంగా నష్టపోయారు. వారందరూ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.. ఈ అనుభవాల కారణంగాచిరంజీవిని నమ్మినట్లు పవన్ కల్యాణ్‌ను నమ్మడానికి… కాపు నాయకులు సిద్ధంగా లేరు. మొత్తంగా పవన్ సామాజికవర్గం … గతంలో పీఆర్పీకి సపోర్ట్ చేసినట్లుగా ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయడం లేదన్నది మాత్రం నిజం.

ఏపీలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయాల్లో నిలబడాలంటే.. సొంత సామాజికవర్గ మద్దతు లేకపోతే… కనీస ఓటు బ్యాంక్ సంపాదించుకోవడం కష్టం. ఇదే టెన్షన్‌తో నాగబాబు, పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయాలు చేస్తున్నారు.

అవసరం లేకపోయినా.. బాలకృష్ణ, ఎన్టీఆర్ లపై వ్యాఖ్యల చేయడం ద్వారా… వారి అభిమానులను రెచ్చగొట్టి.. ఎదురుదాడి చేసేలా వ్యూహం అమలు చేస్తున్నారు. అలా చేయడం ద్వారా… తమకు అండగా.. తమ సామాజికవర్గం వస్తుందని ఆశపడుతున్నారు ..

To Top
error: Content is protected !!