నేషనల్

భారత భూభాగంలో ప్రవేశించిన పాక్ విమానాలు!

Pakistani jets violates Indian airspace
భారత భూభాగంలో ప్రవేశించిన పాక్ విమానాలు!

భారత వైమానిక దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. అసహనంతో ఊగిపోతూ..ఎల్‌వోసీ వెంబడి చెలరేగిపోతోంది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చావుదెబ్బ కొట్టినా..సిగ్గు లేకుండా రెచ్చిపోతోంది. నిన్న సాయంత్రం నుంచి ఇష్టారీతిన కాల్పులకు తెగబడుతోంది. మిలటరీ పోస్టులతో పాటు పౌరుల ఇళ్లను టార్గెట్ చేసుకొని షెల్లింగ్ జరుపుతోంది.

సరిహద్దు వెంబడి 12 నుంచి 15 చోట్ల యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఇక తాజాగా కాశ్మీర్ గగనతలంలోకి పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ ప్రవేశించాయి. దాంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు చొరబడ్డాయి. రాజౌరీ సెక్టార్‌లో ఈ యుద్ధ విమానాలు చొచ్చుకువచ్చినట్టుగా భారత రక్షణ శాఖా ధికారులు చెబుతున్నారు. పాక్ విమానాలను భారత వైమానిక దళాలు వెనక్కు పంపించాయి.

బుధవారం నాడు పాక్‌కు చెందిన యుద్ధ విమానాలను గుర్తించిన భారత వైమానిక దళం పాక్ విమానాలపై ఎదురు దాడికి పాల్పడింది. దీంతో పాక్ యుద్ధ విమానాలు వెనక్కు వెళ్లాయి. పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో గల జైషే మహ్మాద్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌తో పాక్ ఈ కవ్వింపు చర్యలకు దిగినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు ..ఇదిలా ఉండగా ..భారత్ ‘ఎయిర్ స్ట్రైక్స్’ నేపథ్యంలో పాకిస్థాన్‌ను అగ్రరాజ్యం అమెరికా మరోసారి హెచ్చరించింది.

పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద తండాల విషయంలో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. పాక్, భారత్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ సెక్రటరీ మైక్ పోంపియో ఓ ప్రకటన విడుదల చేశరు. ఈ ప్రకటనలో పాక్‌పై సునిశిత వ్యాఖ్యలు చేశారు. భారత్ చేపట్టిన ఎయిర్ స్ట్రైక్స్‌ను కౌంటర్ టెర్రరిజంలో భాగమని అభివర్ణించారు. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయకుంటే పాకిస్థాన్‌కే నష్టం జరుగుతుందని హితవు పలికారు.

ఉగ్రవాదంపై తీరు మార్చుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సూచించారు. భారత్‌పై కవ్వింపు చర్యలకు తగవని హెచ్చరించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత తగ్గించాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖురేషీకి సూచించారు. ఫిబ్రవరి 26 దాడులపై తాను భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడానని.. సరిహద్దుల్లో శాంతి పరిరక్షణకు తోడ్పాడుటనందిస్తామని చెప్పినట్టు ప్రెస్‌నోట్‌లో మైక్ తెలిపారు. మొత్తానికి రెండు దేశాల ప్రతిదాడులతో సరిహద్దియూలో యుద్ధవాతావరం నెలకొని ఉంది ..

To Top
error: Content is protected !!