సినిమా

సంక్రాంతి యుద్ధంలో గెలిచి నిలిచిన చిత్రం ఇదే!

one movie won in sankranthi festival movies
సంక్రాంతి యుద్ధంలో గెలిచి నిలిచిన చిత్రం ఇదే!

తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలు వారి వారి లెజెండరి హీరోల సినిమాలు విడుదలకావడంతో తన్మయత్నంలో మునిగిపోయారు .. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎన్నో ఏళ్లుగా నీరాజనాలందుకుంటున్న రజిని పేట సినిమా ఒకవైపు , అన్నగారు అని ముద్దుగా పిలుచుకునే ఆంద్ర ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ బయో పిక్ మరోవైపు .. వీరిద్దరి సినిమాలు కేవలం ఒకరోజు వ్యవధిలోనే విడుదలై సంక్రాంతి బాక్స్ ఆఫీసు యుద్ధంలో అడుగుపెట్టాయి ..

ఇక ఈ రెండు సినిమాలో ఏది ఘనవిజయం సాధించిందో , ఏది పరాజయాన్ని మూటగట్టుకొందో ఒక్కసారి పరిశీలిస్తే .. ఈ రెండు సినిమాలు కూడా యూనానిమస్ హిట్ టాక్ ని సొంతం చేసుకోక చతికిలపడ్డాయా అంటూ ఇనీషియల్ టాక్ ఒకటి వచ్చేసింది .., రెండిటిలో పోలిస్తే ఎన్టీఆర్ కథానాయకుడు టాక్ కొంచం పర్వాలేదనిపిస్తుంది.. ..

మొదటిరోజు థియేటర్లలో ఎన్టీఆర్ అభిమానులు , ఎన్టీఆర్ ని ఆరాధించే టిడిపి కార్యకర్తలు వెళ్లడంతో అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ రావాలి ..అది మెల్లి మెల్లిగా రెండు మూడో రోజు వచ్చేసరికి సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు రావడంతో అదికాస్తా సూపర్ హిట్ చిత్రంగా నిలవాలి …

కానీ అభిమానుల నుండే పర్వాలేదు అని టాక్ వస్తే లాంగ్ రన్ లో హిట్ అవ్వడం కష్టమైపోతుంది .. లెజండరీ ఎన్టీఆర్ జీవితానికున్న ప్రతిష్ట పక్కనపెడితే , ఈ సినిమా మేకర్స్ , ఎన్టీఆర్ కథానాయకుడిని చిత్రీకరించడంలో పెద్దగా హోమ్ వర్క్ ఏం చేయలేదని అర్ధం అవుతుంది .., ఎ

న్టీఆర్ సినిమాలు , ఆయన్ని పొగిడే డైలాగులు , హీరో ఎలివేషన్ కోసం వేసే రొటీన్ సీన్లు ఏమంత పండలేవని సామాన్యుడి అభిప్రాయం .. ముఖ్యంగా బాలకృష్ణ సామాన్య ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడంలో విఫలం అయ్యాడని అంటున్నారు .., ఆయన వ్యక్తిగత ప్రవర్తన ఇమేజి పై ఎల్లవేళలా ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి ..,

సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ వివాదాస్పదమవుతూ ట్రోలింగ్ కి గురవ్వడం అవ్వడం ,ఈ మధ్య కాలంలో బాలకృష్ణపై కామెడీ స్పూఫులు ఇబ్బడిముబ్బడిగా వస్తు ఉండటం , ఈ సినిమాపై ఆ నెగెటివ్ ఇంపాక్ట్ పడిందని , అందుకే సినిమాలో ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసుంటే పూర్తిగా పాజిటివ్ వార్తలతో కథానాకుడు ఆల్ టైం హిట్ అయ్యేదని విశ్లేషకులు భావిస్తున్నారు ..

ముఖ్యంగా మొదటిభాగంలోని కుర్ర ఎన్టీఆర్ పాత్రకు అయినా జూనియర్ ఎన్టీఆర్ ని తీసుకోవాల్సిందని అభిమానులు పేర్కొంటున్నారు .. , ఏజ్డ్ ఎన్టీఆర్ పాత్రకి బాలయ్య యంగ్ ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ అయితే అబ్బాయి బాబాయిలా మల్టి స్టారర్ గా సినిమా తిరుగులేని విజయం దక్కేదని , కానీ ఇప్పుడు ఇది కేవలం ఇప్పుడు టిడిపి పార్టీ సినిమాగానే మిగిలిపోయిందని క్రిటిక్స్ భావిస్తున్నారు ..

ఇక మరోపక్క రజిని పేట సినిమా కూడా అదే పరిస్థితి .. పేట కోసం టెక్నీషన్స్ బాగానే కష్టపడ్డా రియల్ కంటెంట్ లో బలం లేకపోవబడంతో బాక్స్ ఆఫీసుదెగ్గర ఈసినిమా నెమ్మదించింది .. రజనీతో సినిమా చేస్తున్నారంటే నిర్మాణ విలువల గురించి చెప్పేదేముంది? ఎక్కడా రాజీ పడలేదు.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాత్రం నిరాశ పరిచాడు. ఒక అభిమానిలా ఆలోచించి రజనీని స్టైలిష్ గా ప్రెజెంట్ చేయడం వరకు ఓకే కానీ.. ఇంత రొటీన్ కథను ఎలా ఎంచుకున్నాడన్నదే అర్థం కాని విషయం. స్క్రీన్ ప్లే విషయంలోనూ అతడి మార్కేమీ కనిపించలేదు. మాస్ ప్రేక్షకులు..

రజనీ అభిమానుల్ని మెప్పించేలా కొన్ని సన్నివేశాల్ని ఎంటర్టైనింగ్ గా తీయగలిగాడు.. టేకింగ్ లో స్టైల్ చూపించాడు తప్పితే తన నుంచి కొత్తదనం ఆశించే ప్రేక్షకుల్ని మాత్రం అతను నిరాశ పరిచాడు..ఇలా ఈ రెండు సినిమా మేకర్లు హీరోలపై ఉన్న భక్తి భావాల్ని సినిమాపై రుద్దటంతో కథలో నిజాయితీ లోపించి రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీసుదెగ్గర బోల్తాపడ్డాయని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు

To Top
error: Content is protected !!