సినిమా

పండంటి కొడుకు …, ఎన్టీఆర్ కన్నీళ్లు..,

మొన్నీ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అమ్మాయి పుట్టింది అనే వార్త సోషల్ మీడియాలో వీర విహారం చేసింది. ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతికి మొదట అబ్బాయి అభయ్ రామ్ కాగా.. రెండోసారి అమ్మాయి పుట్టిందని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరు ఖండించారు. ఎన్టీఆర్ కి అమ్మాయి పుట్టలేదని.. అసలు ఇంకా డెలివరీ అవ్వలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మరో బ్రేకింగ్ న్యూస్ మీడియాలో వైరల్ అయింది ., గర్భవతిగా ఉన్న ఎన్టీఆర్ సతీమని లక్ష్మి ప్రణతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్ ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నాడు. అంటే అభయ్ రామ్ కు తమ్ముడొచ్చాడన్నమాట. ఎన్టీఆర్ కు అభిమానులంతా అభినందనలు తెలియజేస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి దంపతులకు అభయ్ రామ్ జన్మించిన సంగతి తెలిసిందే. రెండవ కొడుకు పుట్టిన సందర్భంగా ఎన్టీఆర్ ఏమోషినల్ ఫీల్ అయ్యాడు .., ట్విట్టర్ లో ఈ సంగతిని తన అభిమానులతో పంచుకున్నాడు .., మా ఫ్యామిలీ ఇప్పుడు మరింత పెద్దదిగా మారింది. అబ్బాయి పుట్టాడు అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం అరవింద సమేత చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకుడు.

To Top
error: Content is protected !!