కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
ఎన్నారై ఈవెంట్స్

ఎన్నారై వివాహాలకు ఆధార్ తప్పనిసరి

Aadhaar Must Be Made Mandatory For NRI Marriages
ఎన్నారై వివాహాలకు ఆధార్ తప్పనిసరి

భారత్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకునే ఎన్నారై వివాహాలకు ఆధార్ తప్పనిసరి చేయాలని విదేశాంగ మంత్రిత్వశాఖ నియమించిన ప్రత్యేక కమిటీ సిఫారసు చేసింది. తద్వారా ఎన్నారై భర్తలు భార్యలను వదిలిపెట్టి పారిపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చని కమిటీ పేర్కొన్నది. దీంతోపాటు ఎన్నారైలను పెండ్లి చేసుకునే మహిళల హక్కుల పరిరక్షణ.. విదేశాల్లో వరకట్న వేధింపులకు, గృహహింసకు బాధితులుగా మారే మహిళలకు ఈ నిబంధన వల్ల రక్షణ లభిస్తుందని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖకు గత నెల 30న కమిటీ నివేదికను సమర్పించినట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. గృహహింసకు పాల్పడే ఎన్నారై భర్తలను భారత్‌కు అప్పగించేలా ఒప్పందాలను సవరించాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. కాగా ఎన్నారైలు, విదేశాల్లో ఉండే భారతపౌరులు, భారత సంతతికి చెందిన వారిని ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తున్నది. ప్రస్తుతం భారతీయులకు, వీసా కలిగిన విదేశీయులు మాత్రమే ఆధార్ తీసుకోవటానికి అవకాశం ఉన్నది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!