ఇంటర్నేషనల్

ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే టీమిండియా పరిస్థితి ఏంటి?

No indication that any of WC matches will not go ahead as per plan
ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే టీమిండియా పరిస్థితి ఏంటి?

త్వరలో క్రికెట్ ప్రపంచకప్‌ ఆరంభం కానుంది. జూన్‌ 5న తొలి మ్యాచ్‌లో కోహ్లీసేన దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. జూన్‌ 16, ఆదివారం నాడు టీమిండియా, పాకిస్థాన్‌ ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా పోటీపడబోతున్నాయి . అయితే ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి . ఇదే అదనుగా కొందరు క్రికెటర్లు, అభిమానులు పాక్‌తో మ్యాచ్‌ నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి ..

భారత్ -పాక్ లకు ప్రపంచ కప్ లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే ఆసక్తి అందరిలో ఉంది ..దాని గురించి ఒక్కసారి విశ్లేషించుకుంటే .. 1996లో ప్రపంచకప్‌నకు మూడు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. భారత్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ వేదికల్లో మ్యాచ్‌లు జరిగాయి. అనిశ్చిత పరిస్థితులు ఉండటంతో పోటీల నిర్వహణలో శ్రీలంక ఇబ్బంది పడింది. మెగా టోర్నీకి మూడు వారాల ముందు కొలంబోలో ఎల్‌టీటీఈ బాంబు దాడి చేసింది.

ఈ ఘటనతో క్రికెట్‌ ప్రపంచం ఉలిక్కిపడింది. అక్కడ ఆడేందుకు కొన్ని దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. షెడ్యూలు ప్రకారం నాలుగు మ్యాచ్‌లు లంకలో జరగాలి. నియమం ప్రకారం జింబాబ్వే, కెన్యా వంటి పసికూనలు మాత్రమే అక్కడ ఆడాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ మాత్రం వాకోవర్‌ ఇచ్చాయి. వీటివల్ల శ్రీలంక లబ్ధి పొందింది. ఐదు విజయాలతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది. చివరికి ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచకప్‌ ముద్దాడింది. 2003 ప్రపంచకప్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చాయి. సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో భారత్‌ ఫైనల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. దురదృష్టం వెంటాడటంతో దాదా జట్టు రన్నరప్‌కు పరిమితమైంది. ఈ మ్యాచ్‌లు నిర్వహించే సమయంలో జింబాబ్వేలో రాజకీయ అనిశ్చితి తలెత్తింది. అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే వివాదాస్పదంగా అధికారం చేజిక్కించుకున్నాడు. ప్రజా ఆందోళనలు, నిరసనలు అక్కడ హోరెత్తాయి. ఆటగాళ్ల శ్రేయస్సు దృష్ట్యా ఇంగ్లాండ్‌ అక్కడ ఆడలేమని చెప్పింది.

ఇక కెన్యాలో అంతర్యుద్ధం పరిస్థితులు ఉండటంతో న్యూజిలాండ్‌ మ్యాచ్‌ రద్దు చేసుకుంది.ఐసీసీ టోర్నీల్లో జట్లు మ్యాచ్‌లను రద్దు చేసుకుంటే ప్రత్యర్థికి ఆయాచితంగా పాయింట్లు లభిస్తాయి. 1996లో శ్రీలంక ఇలాగే లబ్ధిపొందింది. అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టి ప్రపంచకప్‌ నెగ్గింది. 2003లో మాత్రం ఇంగ్లాండ్‌ ఇబ్బంది పడింది. జింబాబ్వే, ఇంగ్లాండ్‌ గ్రూప్‌ దశలో తలో మూడు మ్యాచ్‌లు నెగ్గి సమంగా నిలిచాయి. పాక్‌, జింబాబ్వే మ్యాచ్‌ ఫలితం తేలకపోవడంతో ఇంగ్లాండ్‌ గ్రూప్‌ దశలోనే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. కివీస్‌ తర్వాతి దశకు చేరుకున్నా అప్పటి ఫార్మాట్‌ ప్రకారం గ్రూప్‌ దశ పాయింట్లు లెక్కలోకి వస్తాయి. కివీస్‌పై ఇలా వచ్చిన నాలుగు బోనస్‌ పాయింట్లు కలుపుకొని 14 పాయింట్లతో కెన్యా మూడో స్థానంలో నిలిచింది. సెమీస్‌ చేరింది. కివీస్‌ ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో అభిమానులు, క్రికెటర్లలో పాక్‌పై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఆ జట్టుతో మ్యాచ్‌ రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలా గనక చేస్తే ఏం జరుగుతుందో ఓ సారి పరిశీలిద్దాం. ఐసీసీ 2019 ప్రపంచకప్‌ రౌండ్‌రాబిన్‌ ఫార్మాట్‌లో జరుగుతోంది. ఒక జట్టు మిగతా అన్ని జట్లతో తలపడాలి. చిన్న జట్లేవీ లేవు. పది జట్లు పోటీపడతాయి. అంటే ఒక్కో జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. చివరికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన దేశాలు సెమీస్‌లో తలపడతాయి. ఆ తర్వాత ఫైనల్‌ జరుగుతుంది. పాక్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకున్నా తొలి నాలుగు స్థానాల్లో నిలిస్తే ఫర్వాలేదు.

అలా కాకుండా అనూహ్య ఓటములు ఎదురైతే మాత్రం రద్దైన మ్యాచ్‌ ప్రభావం కనిపిస్తుంది. దురదృష్టం వెంటాడితే సెమీస్‌ చేరుకొనే అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఒక వేళ రెండు జట్లు ఫైనల్‌ చేరితే పరిస్థితి ఏంటన్నది ఆలోచనలకు అందడం కష్టమే..అయితే భారత్ -పాక్ అంటే అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది ..అన్ని పనులు మానుకొని మరి మ్యాచ్ చూస్తారు .. జట్టు గెలవాలని పూజలు కూడా చేస్తారు .. కానీ మ్యాచ్ రద్దయితే అభిమానులకు నిరాశ తప్పదు ..కానీ దేశ రక్షణకు పాటు పడే సైనికులపై దాడి నేపథ్యంలో ..పాక్ తో ఎలాంటి సంబంధాలు వద్దన్నా ఇండియన్స్ ఆలోచనలో భాగంగా మ్యాచ్ రద్దవోచ్చని తెలుస్తుంది .

To Top
error: Content is protected !!