సినిమా

‘హ్యాపీ వెడ్డింగ్’లో నిహారిక అదరగొట్టేసిందట!

'హ్యాపీ వెడ్డింగ్'లో నిహారిక అదరగొట్టేసిందట!

సుమంత్ అశ్విన్ హీరోగా .. నిహారిక కథానాయికగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా తెరకెక్కుతోంది. అందమైన ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ‘యు’ సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆనంద్ పాత్రలో సుమంత్ అశ్విన్ .. అక్షర పాత్రలో నిహారిక కనిపించనున్నారు. అక్షర పాత్రను చాలా వైవిధ్యభరితంగా తీర్చిదిద్దారనీ .. ఈ పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని నిహారిక భావిస్తోంది.

ఈ పాత్రలో ఆమె అదరగొట్టేసిందనేది యూనిట్ సభ్యుల మాట. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. సుమంత్ అశ్విన్ .. నిహారిక ఇద్దరూ కూడా ఈ సినిమా సక్సెస్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ల ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందేమో చూడాలి.

To Top
error: Content is protected !!