ఆంధ్ర ప్రదేశ్

వివేకా కేసులో తెరపైకి కొత్త పేరు-హంతకుడు అతనేనా!

New twist in YS Vivekananda Reddy murder case
వివేకా కేసులో తెరపైకి కొత్త పేరు-హంతకుడు అతనేనా!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతుంది ..ఈ కేసులో సిట్ బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి నుండి కసునూరి పరమేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. పరమేశ్వర్‌ రెడ్డికి, వివేకానందరెడ్డి మధ్య వారం రోజుల క్రితం గొడవ జరిగిందని తెలుస్తోంది.వైఎస్ వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితులుగా గంగిరెడ్డి ఉన్నాడు.

హత్యకు రెండు రోజుల ముందే గంగిరెడ్డితో వైఎస్ వివేకానందరెడ్డి భేటీ అయ్యారు. గంగిరెడ్డికి చెప్పకుండా వైఎస్ వివేకానందరెడ్డి ఏ పని కూడ చేయరని స్థానికులు చెబుతున్నారు. గంగిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు పరమేశ్వర్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిసిన తర్వాత రోజు నుండి గంగిరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు.

ఆదివారం నాడు వైఎస్ వివేకానందరెడ్డి సోదరులను విచారించారు. గంగిరెడ్డిని విచారించిన సమయంలో పరమేశ్వర్ రెడ్డి పేరు వచ్చినట్టుగా సమాచారం. వారం రోజుల క్రితం పరమేశ్వర్ రెడ్డి-వివేకానంద రెడ్డి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే పరమేశ్వర్ రెడ్డి వైసీపీ నుండి టీడీపీలో చేరేందుకు కూడ రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి నుండి పరమేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు. పరమేశ్వర్ రెడ్డి భార్య కూడ ఇంట్లో లేరు. అయితే వివేకాకు అత్యంత సన్నిహితంగా ఉన్నారనే పేరున్న వారిలో గంగిరెడ్డి తర్వాత పరమేశ్వర్ రెడ్డి ఒకరు . అయితే ఆయన ఎందుకు కన్పించకుండా పోయారనేది ప్రస్తుతం అంతచిక్కడం లేదు.పరమేశ్వర్ రెడ్డి కోసం రెండు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

అన్ని కోణాల్లో పోలీసులు ఈ కేసు విషయమై దర్యాప్తు చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే 10 మంది అనుమాని తులను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.. ఇంతకీ పరమేశ్వరుడే పాత్రపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి .

To Top
error: Content is protected !!