ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్త టెక్నాలజీతో హైవే!

NEW technology with Highway in andhra pradesh
ఆంధ్రప్రదేశ్ లో కొత్త టెక్నాలజీతో హైవే!

తీరం వెంబడి నిర్మిస్తున్న జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఎన్‌హెచ్‌ అధికారులు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కాల్వ వెంబడి నిర్మిస్తున్న రహదారి కృంగిపోతుండడంతో అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన విధానాన్ని జిల్లాలో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల రోడ్డు ఏళ్ళు గడిచినా బీటలు తీసే అవకాశం ఉండదంటున్నారు. ప్రస్తుతం పూర్తయిన పనుల స్థానంలో మళ్లీ ఈ విధానాన్ని వినియోగిస్తున్నారు.

కత్తిపూడి నుంచి చేపట్టిన 216 జాతీయ రహదారి జిల్లాలో చించినాడ నుంచి భీమవరం మండలం లోసరి వరకు జరుగుతుంది. నాలుగేళ్ళ క్రితం చేపట్టిన ఈ పనులు మందకొడిగా సాగుతున్నాయి. చాల చోట్ల వేసిన రహదారి నెల రోజుల గడవక ముందే కృంగిపోయింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్‌హెచ్‌ అధికారులు పనులను నిలిపేశారు.

కాల్వల వెంబడి నిర్మించే రహదారులు ఈ విధంగా కృంగిపోవడం సర్వ సాధారణం. అయితే రద్దీగా ఉండే రహదారి కావడంతో కొత్త టెక్నాలజీని వినియోగించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా కాల్వ వెంబడి నిర్మించి రహదారికి ఒకవైపు నాలుగు ఆడుగుల మేర గొయ్యి తీశారు. మట్టిని పూర్తిగా తీసివేశారు.

తొలగించిన మట్టిలో కొన్ని రకాల కెమికల్స్‌ వేసి తిరిగి గోతుల్లో వేస్తున్నారు. దీనివల్ల సిమెంట్‌ మాదిరిగా ఆ గొయ్యి పూడుకుపోతుంది. రోడ్డు పక్కన కాల్వ ప్రవాహిస్తున్నా.. ఆ ప్రభావం రోడ్డుపై కనిపించదు. ప్రస్తుతం దిగమర్రు నుంచి నరసాపురం రైల్వే వంతెన వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

అయినప్పటికీ మళ్లీ రోడ్డును పగులగొట్టి గోతులు తీసుకున్నారు. మొగల్తూరు వరకు పంట కాల్వ వెంబడి ఇదే తరహాలో కాల్వకు ఒకవైపు.. రివిట్‌మెంట్‌ వాల్‌తో పాటు కెమికల్స్‌తో రోడ్డును పటిష్ఠపరుస్తూ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. సుమారు 51 కిలోమీటర్ల మేర పనులు చేప ట్టాల్సి ఉండగా.. అందులో 30 కిలోమీటర్లు కాల్వ వెంబడే ఉంది.

 

 

 

To Top
error: Content is protected !!