అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
క్రీడలు

ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసిన తమీమ్ పై నెటిజన్ల ప్రశంసలు

యూఏఈలో శనివారం ప్రారంభమైన ఆసియా కప్ లో బంగ్లాదేశ్ బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ముష్ఫికర్ రహీమ్ (144: 150 బంతుల్లో 11×4, 4×6) బంగ్లాను విజయ తీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో రహీమ్ తో పాటు బంగ్లా ఆటగాడు తమీమ్ ఇక్బాల్ పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ మ్యాచ్ లో భాగంగా పేస్ బౌలర్ లక్మల్ బౌలింగ్ లో తమీమ్ గాయపడి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. చివరికి 9 వికెట్లు పడిపోవడంతో గాయంతో బాధపడుతున్న తమీమ్ బ్యాటింగ్ కు వచ్చాడు. గాయంతో బాధపడుతూనే ముష్ఫికర్ తో కలసి బంగ్లాదేశ్ స్కోరును 261 పరుగులకు చేర్చాడు. ఎడమ చేతికి గాయపమైనప్పటికీ కేవలం కుడిచేతితో బ్యాటింగ్ చేస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. దీంతో తమీమ్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

కొందరు నెటిజన్లు తమీమ్ ను సౌత్ ఆఫ్రికా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తో పోలుస్తున్నారు. 2009లో సిడ్నీలో జరిగిన మ్యాచ్ లో చేయి విరిగినా స్మిత్ జట్టు కోసం 8.2 ఓవర్ల పాటు మైదానంలో ఒంటి చేత్తో పోరాడాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ 261 పరుగులు చేరగా, బంగ్లా బౌలర్ల ధాటికి శ్రీలంక 124 రన్స్ కే ఆలౌట్ అయింది.

To Top
error: Content is protected !!