నేషనల్

హిమాచల్ ప్రదేశ్‌లో నోటాకు 0.9శాతం మంది ఓటర్లు!

హిమాచల్ ప్రదేశ్‌లో నోటాకు 0.9శాతం మంది ఓటర్లు!

హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు 0.9శాతం ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు ఉంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను కేవలం 0.9శాతం మంది ఓటర్లు మాత్రమే ఎంచుకున్నారని తేలింది.

To Top
error: Content is protected !!