నేషనల్

దారుణమైన ఆచారం..శోభనం రోజు కన్యత్వ పరీక్షలు..ఎలా నిర్వహిస్తారో తెలుసా?

women harrasment in maharastra
దారుణమైన ఆచారం..శోభనం రోజు కన్యత్వ పరీక్షలు..ఎలా నిర్వహిస్తారో తెలుసా?

21వ శతాబ్దంలో ఉన్నా ఇంకా కొన్ని చోట్ల సాంఘిక దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. అవగాహన లేక.. మూఢనమ్మకాలను ఇంకా పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. ప్రత్యేకించి మహిళలు ఎక్కువగా ఈ అనాచారాలకు బలవుతున్నారు. మహా రాష్ట్రలోని ఓ సామాజిక వర్గంలో పెళ్లిరోజే వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహించే దురాచారం ఉంది. ఇది ఇప్పుటికీ కొనసాగుతూనే ఉంది.
మహారాష్ట్రంలోని కంజర్భట్ సామాజిక వర్గంలో పెళ్లి రోజే అమ్మాయి కన్యా కాదా అన్న విషయం తేల్చేందుకు ఓ విషమ పరీక్ష నిర్వహిస్తారు. పెళ్లవగానే అమ్మాయిని, అబ్బాయినీ ఓ హోటల్ గదిలోకి శోభనం కోసం పంపిస్తారు. ఈ గదిలో బెడ్ పై కేవలం తెల్లని వస్త్రాలు మాత్రమే ఉంచుతారు. మొదటి కలయికలో వధువుకు రక్తస్రావం అయితే ఆ అమ్మాయిని కన్యత్వ పరీక్ష పాస్ అయినట్టు.
వధువుకు రక్తస్రావం కాని పక్షంలో ఆ అమ్మాయి కన్య కాదని.. అంతకుముందే ఆమెకు లైంగిక సంబంధాలు ఉన్నట్టు నిర్థారిస్తారు. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పెళ్లి వేదిక వద్దే అమ్మాయిని కొట్టడం, తిట్టడం జరుగుతుంది. చాలా పెళ్లిళ్లు ఆగిపోతాయి కూడా. ఈ దురాచారంపై ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన వివేక్ తమైచికర్ అనే యువతి ఉద్యమిస్తోంది. ఈ కన్యత్వ పరీక్షలను ఆపాలంటూ తమ సామాజిక వర్గంలోని యువకులకు ఆమె పిలుపు ఇస్తోంది. ‘స్టాప్‌ ద వి రిచువల్ ‘ పేరుతో ఓ వాట్సాప్ గ్రూపును ప్రారంభించింది. పెళ్లికాని వివేక్ తమైచికర్ తాను కన్యత్వ పరీక్షలో పాల్గొనేది లేదని తేల్చి చెప్పింది. తనలాగే యువతీ యువకులు ఈ పరీక్షలను తిరస్కరించాలని అంటోంది. కానీ కొందరు కులపెద్దలు ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నారు.

To Top
error: Content is protected !!