నేషనల్

మొదటిసారి మనిషికి ఆ ఇన్ఫెక్షన్ సోకింది

eye worm infection
మొదటిసారి మనిషికి ఆ ఇన్ఫెక్షన్ సోకింది

ఇప్పటివరకు ప్రపంచంలో కేవలం పశువుల కళ్లకు మాత్రమే వచ్చిన ఇన్ఫెక్షన్ అది. తొలిసారి ఓ మహిళకు సోకింది. అమెరికాలో ఇప్పుడీ కేసు సంచలనం సృష్టిస్తున్నది. 1.27 సెంటీమీటర్ల పొడవున్న కొన్ని చిన్న పురుగులు ఆమె కంట్లో చేరాయి. ఇది థెలాజియా గులోసా జాతికి చెందిన పురుగులు. ఇలాంటివి 14 పురుగులను ఆమె కంట్లో నుంచి తీసినట్లు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సైంటిస్టులు తెలిపారు. ఆరెగాన్‌కు చెందిన ఆ 26 ఏళ్ల మహిళ కంట్లో నుంచి 20 రోజుల వ్యవధిలో ఈ 14 పురుగులను బయటకు తీశారు. ఈ థెలాజియా జాతికి చెందిన పురుగులు అమెరికాలోని ఉత్తర రాష్ర్టాలు, దక్షిణ కెనడాల్లో ఉండే పశువుల్లో మాత్రమే కనిపించాయి. ఇలాంటి పురుగులు ఎక్కవ కాలం పాటు కంట్లో ఉంటే.. మొత్తానికి చూపే పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అసలు ఇలాంటి కంటి ఇన్ఫెక్షన్లు అమెరికాలో చాలా చాలా తక్కువ. అందులోనూ థెలాజియా జాతి పురుగు ఓ మనిషి కంట్లో చేరడం ఇదే తొలిసారి అని రిచర్డ్ బ్రాడ్‌బరీ అనే డాక్టర్ చెప్పారు. గతంలో కేవలం రెండు కంటి పురుగు జాతులు మాత్రమే కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యాయని, ఈ థెలాజియా మూడోదని బ్రాడ్‌బరీ అన్నారు. తరచూ బయట తిరిగే అలవాటున్న ఆ మహిళ కొద్ది రోజుల కిందట తన ఎడమ కంటిలోపల ఓ చిన్న పురుగు ఉన్నట్లు గుర్తించింది. నిజానికి ఇలాంటి కంటి పురుగులు కుక్కలు, పిల్లులు, మృగాల్లో కనిపిస్తుంటాయి.

To Top
error: Content is protected !!