నేషనల్

రాహూల్ ఆ విషయంపై ఏమన్నాడో తెలుసా..!

రాహూల్ ఆ విషయంపై ఏమన్నాడో తెలుసా..!

ఈ మద్య గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ తో ఢీ అంటే ఢీ అన్నారు..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇప్పటి వరుకు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన బీజేపీ రాహూల్ గాంధీ ప్రచారానికి వచ్చిన స్పందనలతో కాస్త అలర్ట్ అయ్యారు. అయితే గుజరాత్ లో ఎక్కువ సీట్లు బీజేపీ కైవసం చేసుకున్నా కాంగ్రెస్ మాత్రం గట్టి పోటీ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రస్ పార్టీ అధినేతల అక్కడ క్యాంపెయింగ్ చేస్తున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ గా ఉన్నారు. వర్గాలతో మమేకమవుతూ అడిగినవాళ్లందరికీ కాదనకుండా సెల్ఫీలిచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. మంగళవారం కలబుర్గిలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, మేధావులతో కలిపి ఉమ్మడి ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ”రాహుల్ జీ మీ పెళ్ళెప్పుడు?” అని ప్రశ్నించాడు. దీనికి అంతా ఒక్కసారే నిశ్శబ్ధం వహించారు.

ఆ ప్రశ్నకు రాహూల్ స్పందించి నవ్వూతూ. భలే ప్రశ్న అడిగారు.. మీకు ధన్యవాదాలు.. ఇక్కడుండే ఈ పెద్ద మనుషులు కూడా నన్ను ఎప్పుడూ ఇదే అడుగుతుంటారు. అంటూ తన పక్కనే వున్న సీనియర్ కాంగ్రెస్ సీనియర్లు మల్లికార్జున ఖార్గే, కేపీసీసీ ప్రెసిడెంట్ డాక్టర్ జీ. పరమేశ్వర్ వైపు చూపిస్తూ.. తెలివిగా టాపిక్ మార్చేశారు. ఏది ఏమైనా రాహూల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చినపుడల్లా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ మాట మారుస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

To Top
error: Content is protected !!