నేషనల్

ఓట‌మిపై స్పందించిన రాహుల్ గాంధీ !

గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప్ర‌జ‌ల తీర్పును అంగీక‌రిస్తున్నామ‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ అన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఏర్ప‌డిన కొత్త ప్ర‌భుత్వాల‌కు అభినంద‌న‌లు తెలుపుతున్న‌ట్లు ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. త‌న‌పై అభిమానం చూపిన‌ రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ నేత‌లు మంచి ప్ర‌వ‌ర్త‌న‌తో ప్ర‌చారం జ‌రిపి తాను గ‌ర్వ‌ప‌డేలా చేశార‌ని అన్నారు. క్ర‌మశిక్ష‌ణ‌, ధైర్య‌మే కాంగ్రెస్ పార్టీ బ‌ల‌మ‌ని త‌మ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు వాటినే ప్ర‌చారంలో చూపార‌ని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

To Top
error: Content is protected !!