నేషనల్

షాకింగ్: డేరా బాబా ఆశ్రమం లో లో ‘విష కన్యలు’ ..

షాకింగ్: డేరా బాబా ఆశ్రమం లో లో ‘విష కన్యలు’ ..

సాధ్వీల అత్యాచారం కేసులో గుర్మత్ రామ్‌రహీంకు జైలు శిక్ష పడిన తరువాత డేరాకు సంబంధించిన పలు భయంకర మైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రామ్‌రహీం డేరా ఆశ్రమంలో ‘విష కన్యలు’ అనే ఒక గ్రూప్ ఉంటుంది. ఈ బృందంలోని మహిళలు డేరాలోని అందమైన యువతులను తమ వలలో వేసుకుని, రామ్ రహీం అంతరంగ మందిరానికి తీసుకువెళతారు. ఈ విషకన్యలు రామ్‌రహీంకు అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటారు. వీరంతా గతంలో సాధ్వీలుగా డేరాలో ఉన్నవారే.ఈ విష కన్యలు… యువతులకు మాయమాటలుచెప్పి బాబా ఆశీర్వాదంతో పవిత్రులై పోతారంటూ బాబా దగ్గరకు తీసుకువెళతారు. ఈ నేపధ్యంలో ఏ యువతి కూడా ఎదురుతిరగకుండా చూసే బాధ్యత కూడా విషకన్యలదే! యువతులు ఎవరైనా ఎదురు తిరిగితే వారికి 24 గంటలపాటు ఆహార పానీయాలు ఇవ్వరు. వారిని కుర్చీల్లో కట్టేసి కొడతారు. కోపంగా చూసే యువతుల ముఖంపై మసిపూసి, గాడిదలపై ఊరేగిస్తారు. రామ్‌రహీంకు శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించిన గురుదాస్ సింగ్ ఈ విషయాలను పోలీసులకు వెల్లడించాడు. కాగా ఇలాంటి విషకన్యలపై పోలీసులు ఇంతవరకూ ఎలాంటి చర్యతీసుకోలేదు. కొంతమంది విషకన్యలు ఇప్పటికీ డేరా ఆశ్రమంలోనే ఉన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!