నేషనల్

శశికళ ,దినకరన్ లను గెంటేశారు..

శశికళ ,దినకరన్ లను గెంటేశారు..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళను అన్నాడీఎంకే నుంచి సాగనంపుతూ ఆ పార్టీ జనరల్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. జయలలిత స్థానంలో పార్టీ జనరల్ సెక్రటరీగా పీఠం దక్కించుకున్న శశికళను ఆ పదవి నుంచి దించేసింది. శశకళతో పాటు ఆమె జైలుకెళుతూ డిప్యూటీ చీఫ్‌గా నియమించిన దినకరన్‌ను సైతం పార్టీనుంచి బహిష్కరించారు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలన్నీ సర్వసభ్య సమావేశం రద్దు చేసింది. దీంతో శశికళ వర్గం అలియాస్ ‘‘మన్నార్‌గుడి మాఫియా’’కి అన్నాడీఎంకే చెక్ పెట్టినట్టయింది. ఈ లక్ష్యంతోనే జయలలిత నమ్మినబంటుగా పేరున్న పన్నీర్‌సెల్వం ప్రస్తుత సీఎం పళనిస్వామితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. పళని స్వామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలో సమావేశమైన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ మొత్తం ఆరు కీలక తీర్మానాలను ఆమోదించింది.అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించే అధికారం ఎవరికీ లేదని ఆ పార్టీ వ్యతిరేక వర్గం నేత టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. సర్వసభ్య సమావేశంలో శశికళను,.. తనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత కూడా పార్టీ తమదేనని, శశికళను తొలగించడం ఎవరివల్లా కాదని అన్నారు…dinakaran ఎటువంటి గుర్తింపూ లేని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ చేసిన తీర్మానాలేవీ చెల్లవని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామని అన్నారు. పార్టీకి ప్రధాన కార్యదర్శి ఎన్నటికీ జయలలితేనని, ఆమె ప్రతినిధిగా మాత్రమే శశికళ వ్యవహరిస్తూ వచ్చారని చెప్పిన దినకరన్, తన భవిష్యత్ నిర్ణయంపై మాత్రం మాట దాటవేశారు. పార్టీ నేతలంతా లేకుండా జరిగిన సమావేశం చెల్లదని అన్నారు. కాగా, అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి దినకరన్ వర్గంలోని 20 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు… మొత్తానికి తమిళ రాజకీయాలు బాగా రంజుగా మారాయి..

 

 

 

 

 

 

 

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి వీకే శశికళను తొలగిస్తూ అన్నాడీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉదయం నుంచి జరుగుతున్న పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమెపై చర్చించిన పార్టీ, తక్షణం అమల్లోకి వచ్చేలా శశికళను బర్తరఫ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అమ్మ, దివంగత జయలలిత స్వయంగా పదవుల్లో నియమించిన వారిని ప్రస్తుతానికి కొనసాగించాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది.
రెండాకుల గుర్తు తమకే చెందుతుందని మరో తీర్మానాన్ని పార్టీ ఆమోదించింది. ఆపై సర్వసభ్య సమావేశాన్ని ముగిస్తున్నట్టు ప్రకటన వెలువడింది. ఈ సమావేశానికి పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా స్థాయి నేతలు, వివిధ పార్టీ పదవులను అనుభవిస్తున్నవారు హాజరయ్యారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!