నేషనల్

రాజకీయ నేతల భార్యలకూ మోడీ సెగ!

survey about next pm
రాజకీయ నేతల భార్యలకూ మోడీ సెగ!

ఆస్తుల వ్యవహారంలో ప్రభుత్వం నుంచి తప్పించుకోలేక తలలు పట్టుకుంటున్న కొందరు రాజకీయ నేతలకు కేంద్రం త్వరలో మరో షాక్ ఇవ్వనుంది. ఇక నుంచి ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు తమ జీవిత భాగస్వామి ఆస్తుల వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సుప్రీంకోర్టుకు వివరించింది. ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఆయా అభ్యర్థులు తమ జీవిత భాగస్వామి ఆస్తులు వెల్లడించాల్సి ఉంటుందని తెలిపింది. దీనికి ఎన్నికల సంఘం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు పేర్కొంది. 105 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల ఆస్తులు గణనీయంగా పెరిగినట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయ నేతల ఆస్తులపై సీబీడీటీ ఇలా వ్యాఖ్యానించడం తో రాజకీయా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి..

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!