నేషనల్

ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు….ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని విమ‌ర్శించిన వారి చేతులు న‌రికేయాలని బీజేపీ చీఫ్ నిత్యానంద రాయ్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్‌గా బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి ర‌బ్రీ దేవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి, చేతులు న‌ర‌క‌డానికి చాలా మంది బిహారీలు సిద్ధంగా ఉన్నార‌ని ఆమె అన్నారు. ఆర్జేడీ జాతీయాధ్య‌క్షుడిగా లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను వ‌రుస‌గా 10వ సారి ఎన్నుకున్న జాతీయ కౌన్సిల్ స‌మావేశంలో ఆమె మాట్లాడారు.పీఎం మోదీని వేలెత్తి చూపితే, వేళ్లు న‌రికేస్తామ‌ని కొంద‌రు బీజేపీ నాయ‌కులు చెబుతున్నారు. ద‌మ్ముంటే బిహారీల చేతులు న‌ర‌క‌మ‌ని నేను వారిని ఛాలెంజ్ చేస్తున్నా. బిహారీలు ఊరికే ఊరుకోరు. న‌రేంద్రమోదీ గొంతు కోయ‌డానికి, చేతులు న‌ర‌క‌డానికి చాలామంది బిహారీలు సిద్ధంగా ఉన్నారు’ అని ర‌బ్రీ దేవి అన్నారు. ఇటీవ‌ల అవినీతి కేసుల నెపంతో లాలూని, వారి కుమారుడు సంతోష్ యాద‌వ్‌ను బీజేపీ టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ఆమె ఇలాంటి వ్యాఖ్య‌లు చేసినట్లు స‌మాచారం. ఒక‌ప్పుడు నేత‌లు ప‌రోక్షంగా మాట‌లు అనుకునే వారు కాని ఇప్పుడు నేత‌లు సూటిగానే విమ‌ర్శించుకుంటున్నారు అది కూడా హ‌ద్దులు దాటుతూ చంపుతామ‌నుకునే దాకా వెళ్తుంది…ఇప్ప‌డీ ఘ‌ట‌న చూస్తే అదే నిజ‌మయ్యింది…..

To Top
error: Content is protected !!