కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
నేషనల్

పుట్టిన రోజు నాడే రజనీ పార్టీ ?

Rajinikanth Political News
పుట్టిన రోజు నాడే రజనీ పార్టీ ?

రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ఖాయం అయ్యిందంటున్నారు . పార్టీ ఏర్పాటుకు ఆయన నిర్ణయం తీసుకున్నారా? ఇక ప్రకటించడమే మిగిలిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. కోలీవుడ్‌లోని విశ్వసనీయ వర్గాలు చెప్పే ప్రకారం రజనీకాంత్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే … ఆయన జన్మదినమైన డిసెంబరు 12న ఆయన కొత్త పార్టీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయన కొంతమంది ప్రముఖులతో చర్చించారని తెలిసింది.ఇప్పటికే చిన్నాచితకా తమిళ పార్టీలు రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తుండగా … పెద్ద పార్టీలు మాత్రం ఆయన రాకను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇటీవల రజనీ తన అభిమానులతో ఫోటో సెషన్ నిర్వహించారు. ఆ సమయంలో ‘యుద్ధం వచ్చినప్పుడు చూద్దాం. సిద్ధంగా ఉండండి’ అంటూ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవ్వడం వల్లనే … అలాంటి ప్రకటన చేశారని పలు వర్గాలు విశ్లేషించాయి. బీజేపీ అయితే తమ పార్టీలో చేరాలంటూ బహిరంగంగానే పిలుపునిచ్చింది. అంతేగాక ఆ పార్టీకి చెందిన నేతలు సైతం రజనీని కలిసి మాట్లాడారు. రజనీ పార్టీ ప్రారంభించేందుకే సిద్ధమవుతున్నారు. అందుకే ఆయన హడావుడిగా ‘కాలా’, ‘2.0’ సినిమాలను పూర్తి చేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. డిసెంబరు లోపు ఈ రెండు సినిమాలను విడుదల చేసి ఆ నెల 12వ తేదీన తన జన్మదినం నాడు పార్టీ ప్రారంభించేందుకు రజనీ సన్నాహాలు చేసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!