కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
నేషనల్

పాక్ పై సర్జికఙ్కళ్ స్ట్రైక్స్ జరిపిన మన జవాన్ల అనుభవాలు వినండి.. సెల్యూట్ చేస్తారు..

పాక్ పై సర్జికఙ్కళ్ స్ట్రైక్స్ జరిపిన మన జవాన్ల అనుభవాలు వినండి.. సెల్యూట్ చేస్తారు..

సర్జికల్ ైస్ట్రెక్స్.. మన సైన్యంపై జరుగుతున్న వరుస ఉగ్రదాడులతో ఆత్మైస్థెర్యం కోల్పోతున్న ప్రతి భారతీయుడు రొమ్మువిరిచి ఇదీ మా ఆర్మీ సత్తా అని చాటి చెప్పుకొన్న సందర్భం. మన సైనికులు సరిహద్దు దాటి శత్రువు భూభాగంలోకి ప్రవేశించి.. ఉగ్రమూకలను మట్టుబెట్టి సురక్షితంగా తిరిగొచ్చిన గొప్ప సన్నివేశం. ఈ ఆపరేషన్ పూర్తయి ఏడాది కావొస్తున్న సందర్భంగా సర్జికల్ ైస్ట్రెక్స్ కొనసాగిన తీరును వివరిస్తూ ఓ పుస్తకం విడుదలైంది. ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలిటరీ హీరోస్ పేరుతో శివ్ అరోర్, రాహుల్ సింగ్ రాసిన ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ఆర్మీలోని నిజమైన హీరోలకు సంబంధించిన 14 సంఘటలను, వారు కనబరిచిన అసమాన ధైర్య సాహసాలను ఇందులో పొందుపరిచారు. సర్జికల్ ైస్ట్రెక్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మిషన్‌కు నేతృత్వం వహించిన కమాండర్ తనను మేజర్ మైక్ టాంగోగా పరిచయం చేసుకున్నారు. సర్జికల్‌ైస్ట్రెక్స్‌ను పద్మవ్యూహంగా ఆయన అభివర్ణించారు. గత ఏడాది ఉగ్రవాదులు యూరీలోని ఆర్మీ శిబిరంపై దాడి చేసి 19 మంది సైనికుల ప్రాణాలు హరించడాన్ని ఆర్మీ తీవ్రంగా పరిగణించింది. వారి ఆత్మలకు శాంతి కల్పించడంతోపాటు వరుస ఉగ్రదాడులకు సమాధానంగా సర్జికల్ ైస్ట్రెక్స్ చేపట్టాలని నిర్ణయించింది. యూరీలోని రెండు యూనిట్ల నుంచి మెరికల్లాంటి సైనికులను ఎంచుకొని ఘాతక్ ప్లాటూన్‌ను ఏర్పాటు చేసింది. వారిని సరిహద్దుకు తరలించి కఠిన శిక్షణ ఇచ్చింది. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా) విభాగాలకు చెందిన అధికారులు లక్ష్యాలను గుర్తించారు. ఈ మిషన్‌కు నేతృత్వం వహించాల్సిందిగా మేజర్ మైక్ టాంగోకు ఆదేశాలు వెళ్లాయి. తనతోపాటు ఉండేవారిని ఘాతక్ ప్లాటూన్ నుంచి ఆయనే ఎంపిక చేసుకున్నారు. మా లక్ష్యాలు పాక్ ఆర్మీ పోస్టులకు దగ్గరగా ఉన్నాయి. వెనక్కు వచ్చే క్రమంలో కొందరి ప్రాణాలు పోవచ్చునని అంచనా వేశాం అని మేజర్ టాంగో పేర్కొన్నారు. ముందుగా ఉగ్రవాదుల లాంచింగ్ ప్యాడ్స్‌కు నిప్పు పెట్టి, ఆ గందరగోళంలో శత్రువులను గుర్తించి మట్టుబెట్టాలని, సురక్షితంగా వెనక్కు రావాలని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
సర్జికల్ ైస్ట్రెక్స్ బృందానికి సైన్యం అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. ఆధునిక శాటిలైట్ డివైజ్‌ల ద్వారా లక్ష్యాలను ఎప్పటికప్పుడు నిర్దేశించారు. మేజర్ ట్యాంగోకు ఎం4ఏ1 5.56 ఎంఎం కార్బైన్, మిగతా సభ్యులకు ఎం4ఏ1, ఇజ్రాయెల్‌కు చెందిన టీఏఆర్-21 అసాల్ట్‌రైఫిల్స్, సీ-90 గ్రనేడ్స్, గలీల్ స్నైపర్ రైఫిల్స్ ఆర్మీ సమకూర్చింది. రాత్రుళ్లు చూడగలిగే నైట్‌విజన్ పరికరాలను అందించింది.సరిహద్దులో పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) సహాయంతో నడుస్తున్న నాలుగు ఉగ్రవాదుల లాంచింగ్ ప్యాడ్స్‌ను ధ్వంసం చేయాలని ఆర్మీ నిర్ణయించింది. వీటికి పాక్ ఆర్మీ రక్షణ కల్పిస్తున్నట్టు గుర్తించింది. లక్ష్యాలను నిర్దేశించడంలో నలుగురు పాక్ జాతీయుల సాయం తీసుకున్నది. వారిలో ఇద్దరు పీవోకేలో నివసించేవారు కాగా, మరో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ సభ్యులు. మన ఆర్మీ వారిని కొన్నేండ్ల కిందటే ఇన్ఫార్మర్లుగా మార్చుకున్నది. దాడులకు దిగే కొన్ని గంటల ముందు సైనికులకు లక్ష్యాలను వివరించారు.మేజర్ టాంగో నేతృత్వంలోని సైనికులు మూడు బృందాలుగా విడిపోయి నాలుగు లాంచింగ్ ప్యాడ్స్‌పై దాడి చేశారు. మేజర్ బృందానికి రెండు టార్గెట్స్ ఇచ్చారు. ఈ రెండింటి మధ్య 500 మీటర్ల దూరం ఉన్నది. వీటికి సమీపంలోనే పాక్ ఆర్మీ పోస్టులు ఉండడంతో, ఎదురుదాడి జరిగే అవకాశాలు ఎక్కువ. దీంతో వారు రెండు బృందాలుగా విడిపోయి దాడి చేశారు. కేవలం గంట వ్యవధిలోనే లాంచింగ్ ప్యాడ్స్‌ను ధ్వంసం చేశారు. ఆ తర్వాత మూడు సైనిక బృందాలు ఒకచోట కలుసుకున్నాయి. వారు పీవోకేలోకి వచ్చిన మార్గం కాకుండా వేరే మార్గంలో భారత్‌కు చేరుకోవాలని మేజర్ నిర్ణయించారు. ఈ మార్గం కాస్త క్లిష్టంగా ఉన్నా సురక్షితమైనదని భావించారు. వారు తిరిగి వస్తుండగా పాక్ సైనికులు గుర్తించి కాల్పులు ప్రారంభించారు. దీంతో వారు గంటలపాటు పాకుతూ, చెట్ల మాటున దాక్కుంటూ కొండలు ఎక్కారు. పాక్ సైనికులు వారి వద్ద ఉన్న అన్ని ఆయుధాలతో దాడి చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొన్నిసార్లు బుల్లెట్లు చెవుల సమీపం నుంచి వెళ్లాయి. ముఖ్యంగా 60 మీటర్ల మార్గం మృత్యుకుహరంగా కనిపించింది. మేం నడుస్తూ వెళ్లినా, తెల్లారినా చనిపోయేవాళ్లం. సూర్యోదయానికి ముందే 4.30 గంటలకు భారత భూభాగంలోకి వచ్చాం అని మేజర్ టాంగో గుర్తు చేసుకున్నారు. ఈ దాడిలో 20 మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు మొదట భావించినా, 38-40 మంది ఉగ్రవాదులు, ఇద్దరు పాక్ సైనికులు చనిపోయినట్టు ఆ తర్వాత తేలింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!