నేషనల్

తెర‌పైకి సీఎంగా కొత్త నాయ‌కుడి పేరు…ఎవ‌రో తెలుసా.

హిమాచల్‌ ప్రదేశ్‌లో భార‌తీయ జ‌నతా పార్టీ అత్య‌ధిక స్థానాల్లో ఆధిక్యం క‌న‌బ‌రుస్తోన్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఆ పార్టీ సీఎం అభ్య‌ర్థి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌ ఓటమి దిశ‌గా వెళుతుండ‌డంతో ఆ రాష్ట్ర సీఎంగా కొత్త నాయ‌కుడి పేరు తెర‌పైకి వ‌చ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయించాల‌ని బీజేపీ అధిష్ఠానం యోచిస్తోంది. నిజానికి ముఖ్య‌మంత్రి అభ్యర్థి రేసులో గతంలోనూ ధుమాల్‌తో నడ్డా పోటీ ప‌డ్డారు. అయితే, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ వీరభద్రసింగ్‌కు గట్టిగా పోటీ ఇవ్వగలరనే ఉద్దేశంతో ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ను బీజేపీ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఇప్పుడు ఆయ‌న ఓట‌మి దిశ‌గా ఉండ‌డంతో బీజేపీ అధిష్ఠానం త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకుంటోంది.

To Top
error: Content is protected !!