నేషనల్

జైల్లో శశికళ రాణిభోగాలపై వెలుగుచూసిన మరిన్ని విషయాలు…

అక్రమాస్తుల కేసులో కర్నాటకలోని పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు రాణిభోగాలు కల్పించేందుకు జైలు సిబ్బంది నిబంధనలు తుంగలో తొక్కారా? జైల్లో ఆమెను వీఐపీ ఖైదీగా పరిగనించేందుకు అడ్డగోల వ్యవహారాలకు తెరలేపారా? సమాచారహక్కు చట్టం కింద వెలుగు చూసిన నిజాలు ఏంటి? జైళ్లశాఖ డీఐజీ రూపా నివేదిక ఎలా ఉన్నప్పటికీ ఆమెకు రాణిభోగాలు అందుతున్నాయన్న విషయం మరోసారి స్పష్టమైంది. సమాచార హక్కు చట్టం కింద పరప్పన అగ్రహారం జైల్లో శశికళ రాణిభోగాలపై మరిన్ని విషయాల వెలుగుచూశాయి.జయ అక్రమాస్తుల కేసులో శశి జైలు జీవితం గడుపుతున్నారు. అయితే అమెను జైల్లో వీఐపీ ఖైదీగా పరిగణిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం కింద వెల్లడయింది. సాధారణంగా జైలులో ఖైదీలకు కొన్ని పనులు అప్పగిస్తుంటారు. కానీ శశికళకు మాత్రం ఎలాంటి పనులు అప్పగించలేదు. ఈ విషయం ఆర్టీఐ కింద వెలుగు చూసింది. ఇక శశిని కలిసేందుకు జైలు అధికారులు ఇబ్బడి ముబ్బడిగా అధికారులు అనుమతులు ఇచ్చారు. జైలు నిబంధనల ప్రకారం ఒక ఖైదీని కలిసేందుకు కేవలం నలుగురు నుంచి ఆరుగురికి మాత్రమే రక్తసంబంధీకులకు అనుమతి ఇస్తారు. కానీ జైలు సిబ్బంది నిబంధనలు అతిక్రమించి శశికళను కలిసేందుకు 24 మందికి అనుమతి ఇచ్చారు. ఈ విషయం కూడా ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చింది.జైలులో శశికి రాణిభోగాలు అందుతున్నాయంటూ డీఐజీ రూపా ఇప్పటికే కర్నాటక ప్రభుత్వానికి మూడు నివేదికలు సమర్పించారు. ఆమెకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేందుకు జైలు సిబ్బంది రూ. 2కోట్లు లంచం తీసుకున్నట్లు రూపా ఆరోపించారు. జైలులో ఆమెకు ప్రత్యేక ఆహారాన్ని అందించారని నివేదికలో పేర్కొన్నారు. శశికి ప్రత్యేక సెల్ కేటాయించారని తెలిపారు. పైగా శశికళ సెల్ ఉన్న బ్యారక్ చుట్టుపక్కలకు ఎవరినీ వెళ్లనీయడం లేదని రూపా స్పష్టం చేశారు. శశి కోసం ఐదు బ్యారక్‌లను ఖాళీగా ఉంచారని తన నివేదికలో పేర్కొన్నారు. జైలులో రాణిభోగాలు అనుభవించడమే కాకుండా శశి పలుమార్లు జైలు బయటికి వెళ్లి వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి సీసీ పుటేజీలు కూడా బహిర్గతమయ్యాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!