కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
నేషనల్

చైనా కు మూడింది.. ఉత్తరకొరియ నెక్స్ట్ బాంబ్ చైనా మీదే..

చైనా కు మూడింది.. ఉత్తరకొరియ నెక్స్ట్ బాంబ్ చైనా మీదే..

పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.. అనేది సాధారంగా వాడే సామెత. కానీ చైనా విషయంలో సీన్‌ రివర్సు అయింది. ఎలుకకు చెలగాటం.. పిల్లికి ప్రాణసంకటంగా మారింది. ఇక్కడ చైనా పిల్లి అయితే.. ఉత్తరకొరియా ఎలుక..! అమెరికాపై పగబట్టి ఉత్తరకొరియా చేసే పనులు చైనాకు ప్రాణసంకటంగా మారాయి. అలాగని ఆ దేశంతో స్నేహాన్ని కొనసాగించలేదూ.. వదిలించుకోలేదు.ఉత్తర కొరియా ఇటీవల దుందుడుకు చర్యలకు పాల్పడుతూ క్షిపణి పరీక్షలు, అణు పరీక్షలు నిర్వహించింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఉత్తరకొరియాకు సాయం చేస్తున్న చైనాపై గుర్రుగా ఉన్నాయి. ఇటీవల ఉత్తరకొరియా పుంగె-రి కొండల్లోని ఒక సొరంగంలో ఏకంగా హైడ్రోజన్‌ బాంబునే పరీక్షించింది. ఫలితంగా ఆ సొరంగం కూలిపోయి, కొండ బీటలువారింది. ఇక్కడి నుంచి రేడియోధార్మిక వ్యర్థాలు వాతావరణంలో కలుస్తున్నాయని చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది. నూక్లియర్‌ వ్యర్థాలు చైనా వైపు రావడం తథ్యమని.. కానీ వాటిని ఎప్పుడు గుర్తిస్తారనేది ముఖ్యమని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరికొందరు శాస్త్రవేత్తలు ఉత్తరకొరియా పరీక్షించిన హైడ్రోజన్‌ బాంబ్‌ శక్తి అంచనాలకు మించి 250 కిలోటన్నుల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఉత్తరకొరియా సరిహద్దుల్లో వాతవరణంపై ఇప్పటికే దృష్టిపెట్టామని చైనా చెబుతోంది. ఇప్పటి వరకు ఎటువంటి న్యూక్లియర్‌ వ్యర్థాల జాడను కనుగొనలేదని చైనా పర్యావరణ మంత్రి పేర్కొన్నారు.
పుంగె-రి ప్రాంతంలో కనుక ఉత్తర కొరియా మరో అణుపరీక్షను నిర్వహిస్తే చైనా, కొరియాల్లో వేలమంది ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని అమెరికాకు చెందిన రాన్డ్‌ కార్పొరేషన్‌ అనే రక్షణ వ్యవహారాల విశ్లేషణ సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో పుంగె-రి ప్రాంతంలో అణుపరీక్షలు జరగవన్న ఎటువంటి గ్యారెంటీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో నూక్లియర్‌ లీక్‌లపై చైనా తీవ్ర ఆందోళన చెందుతోంది.
ఇప్పటికే ఉత్తరకొరియాతో వ్యాపారం చేసే ఏ దేశంతోనైనా అమెరికా వ్యాపార సంబంధాలు తెంచుకుంటుందని ఇటీవల ట్రంప్‌ హెచ్చరించారు. ఇదే జరిగితే చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. దీంతో చైనా ఎటూ చెప్పలేని స్థితిలో ఉంది. ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు అంటే ఇదేనేమో..

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!