నేషనల్

గుజ‌రాత్ లో బీజేపీకి మిస్ అయిన సెంచ‌రీ…..

bjp party

గుజరాత్‌ ఎన్నికల్లో వరసగా ఆరోసారి విజయం సాధించింది బీజేపీ. ఇప్పటికే 22 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన కమలం పార్టీ మరో ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించనుంది. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారిగా విజయం సాధించింది. అప్పటి నుంచి ఐదుసార్లు సునాయాసంగా మూడంకెల స్కోర్ సాధించిన ఆ పార్టీ, ఈసారి ఆ మార్క్ సాధించలేకపోయింది. ఇక కాంగ్రెస్ గతంలోకంటే మెరుగైన సీట్లను సాధించుకుంది.ప్రధాని మోదీ ఢిల్లీ పీఠం ఎక్కిన తర్వాత గుజరాత్‌లో జరిగిన మొదటి ఎన్నిక ఇదే! పట్టణ ఓటర్లు బీజేపీ వైపు చూడగా, గ్రామీణ ప్రాంతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టు ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. మొత్తం 182 సీట్లున్న గుజరాత్ శాసన సభలో బీజేపీ 100 సీట్లను గెలుచుకోగా, కాంగ్రెస్ 80 స్థానాలకు సొంతం చేసుకుంది. ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికొస్తే.. 68 సీట్లకుగాను స్పష్టమైన మెజార్టీని సాధించింది కమలం పార్టీ. ఈసారి కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది.

 1995… బీజేపీ – 121 సీట్లు, కాంగ్రెస్ -45
 1998… బీజేపీ – 117 సీట్లు, కాంగ్రెస్ -53
 2002… బీజేపీ -127 సీట్లు, కాంగ్రెస్ – 53
 2007… బీజేపీ -117 సీట్లు, కాంగ్రెస్ – 59
 2012… బీజేపీ -116 సీట్లు, కాంగ్రెస్ -60
 2017… బీజేపీ -98 సీట్లు, కాంగ్రెస్ -81

To Top
error: Content is protected !!